ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు అలముకున్నాయి. చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా, యారాడ బీచ్‌లో యువకుడిని రక్షించబోయిన గజ ఈతగాడు మహేష్ గల్లంతయ్యారు.