సాక్షి ప్రతినిధి, గుంటూరు ః గుంటూరు నగరంలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లలో రూ.కోట్ల ఖర్చుతో అంతర్గత నీటి సరఫరా, నూతన పైపులైన్లు, ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజులుగా గుంటూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వాంతులు, విరోచనాలతో కొంతమంది ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో దానిపై పచ్చమీడియా రాద్దాంతం చేస్తోంది.
కలుషి త నీటితో ప్రాణాలు పోతున్నా పట్టవా అంటూ తుప్పు పట్టిన వార్తతో ఈనాడు పత్రికలో తప్పుడు కథనాలు రాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పైపు లైన్లు ప్రాణసంకటంగా మారాయని కలుషి త వార్తను వండివార్చింది. వాస్తవంగా పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పైపులైన్లను మార్చుతూ వచ్చింది.
కానీ ఇవన్నీ కప్పిపుచ్చి పైపులైన్లు మార్చకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందంటూ పచ్చమీడియా కట్టుకథలు అల్లింది. వాతావరణ మార్పులు, కృష్ణానదిలో వస్తున్న నీటిలో తేడా వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని కాచి చల్లార్చి తాగాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.
దశలవారీగా పైపులైన్లు మార్పు
ఆరేడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మారుస్తూ వస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంచినీటి సరఫరా మెరుగు కోసం చర్యలు చేపట్టలేదు. కొత్తగా పైపులైన్లు వేసిన చోట కూడా ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరర్ధకంగా మారాయి. వైఎస్సార్‌సీపీ గుంటూరులో పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నగరంలో రూ.123.15 కోట్ల అంచనాలతో మంచినీటి సరఫరా కోసం ఖర్చు చేస్తున్నారు.
అంతర్గత పైపులైన్లు మార్చడం కోసమే ప్రత్యేకంగా రూ. 44 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గతంలో పైప్‌లైన్లు వేసినప్పటికీ ఇంటర్ కనెక్షన్, సంజీవయ్యనగర్ రైల్వే ట్రాక్ క్రాసింగ్ చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం సంజీవయ్య నగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ చేయడం, ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేశారు.
నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్‌లైన్ అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా నీటి సరఫరాలో గతంలో ఉన్న సమస్యలు లేకుండా పోయాయి. తక్కెళ్లపాడు హెడ్‌వాటర్‌వర్క్స్ నుంచి గోరంట్ల కొండమీదకి పైపులైన్, కొండపై రిజర్వాయర్, కొండ నుంచి చిల్లీస్ రెస్టారెంట్ జంక్షన్ వరకూ 500 ఎంఎం గ్రావిటీ డి్రస్టిబ్యూషన్ పైపులైన్ కోసం రూ. 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
కోటీ 15 లక్షల రూపాయలతో సంగం జాగర్లమూడి హెడ్‌వాటర్‌వర్క్స్‌లోని పాత ఫిల్టరేషన్ ప్లాంట్‌ను పునరుద్దరించారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి సంజీవ్‌నగర్ రైల్వేగేట్‌కు 900 ఎంఎం పైపు లైన్ కోసం రూ. కోటీ 15 లక్షలు, సంజీవ్‌నగర్ రైల్వే గేట్ వద్ద ఇంటర్ కనెక్షన్‌కు రెండు కోట్ల రూపాయలు, నగరంలో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు రూ. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
నగరంలో కొత్త పైపులైన్లు
ఇవి కాకుండా గుంటూరు నగరంలో ప్రధానమైన పైపులైన్లతో పాటు అంతర్గత పైపులైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. తాజాగా అమృత్ పథకం కింద రూ. 184 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి మంజూరు అయ్యాయి. కృష్ణానది పక్కన ఉండవల్లి నుంచి మంగళగిరి వరకూ పాత పైపులైన్ మార్చడంతో పాటు అదనంగా కొత్త పైపులైన్ వేశారు.
మంగళగిరి నుంచి గుంటూరు నగరంలోని తక్కెళ్లపాడుకు, సంగం జాగర్లమూడి నుంచి గుంటూరు నగరానికి కొత్త పైపులైన్లు వేయడంతో పాటు అంతర్గత పైపులైన్లు మార్చేందుకు ఈ రూ. 184 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. వీటికి సంబం«ధించిన డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయి. వీటన్నింటిని మరుగునపెట్టి బురద జల్లడమే పనిగా పచ్చమీడియా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment