pipe lines
-
Fact Check: మీ బుద్ధే కలుషితం
సాక్షి ప్రతినిధి, గుంటూరు ః గుంటూరు నగరంలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లలో రూ.కోట్ల ఖర్చుతో అంతర్గత నీటి సరఫరా, నూతన పైపులైన్లు, ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజులుగా గుంటూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వాంతులు, విరోచనాలతో కొంతమంది ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో దానిపై పచ్చమీడియా రాద్దాంతం చేస్తోంది. కలుషి త నీటితో ప్రాణాలు పోతున్నా పట్టవా అంటూ తుప్పు పట్టిన వార్తతో ఈనాడు పత్రికలో తప్పుడు కథనాలు రాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పైపు లైన్లు ప్రాణసంకటంగా మారాయని కలుషి త వార్తను వండివార్చింది. వాస్తవంగా పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పైపులైన్లను మార్చుతూ వచ్చింది. కానీ ఇవన్నీ కప్పిపుచ్చి పైపులైన్లు మార్చకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందంటూ పచ్చమీడియా కట్టుకథలు అల్లింది. వాతావరణ మార్పులు, కృష్ణానదిలో వస్తున్న నీటిలో తేడా వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని కాచి చల్లార్చి తాగాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. దశలవారీగా పైపులైన్లు మార్పు ఆరేడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మారుస్తూ వస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంచినీటి సరఫరా మెరుగు కోసం చర్యలు చేపట్టలేదు. కొత్తగా పైపులైన్లు వేసిన చోట కూడా ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరర్ధకంగా మారాయి. వైఎస్సార్సీపీ గుంటూరులో పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నగరంలో రూ.123.15 కోట్ల అంచనాలతో మంచినీటి సరఫరా కోసం ఖర్చు చేస్తున్నారు. అంతర్గత పైపులైన్లు మార్చడం కోసమే ప్రత్యేకంగా రూ. 44 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గతంలో పైప్లైన్లు వేసినప్పటికీ ఇంటర్ కనెక్షన్, సంజీవయ్యనగర్ రైల్వే ట్రాక్ క్రాసింగ్ చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం సంజీవయ్య నగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ చేయడం, ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్లైన్ అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా నీటి సరఫరాలో గతంలో ఉన్న సమస్యలు లేకుండా పోయాయి. తక్కెళ్లపాడు హెడ్‌వాటర్‌వర్క్స్ నుంచి గోరంట్ల కొండమీదకి పైపులైన్, కొండపై రిజర్వాయర్, కొండ నుంచి చిల్లీస్ రెస్టారెంట్ జంక్షన్ వరకూ 500 ఎంఎం గ్రావిటీ డి్రస్టిబ్యూషన్ పైపులైన్ కోసం రూ. 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోటీ 15 లక్షల రూపాయలతో సంగం జాగర్లమూడి హెడ్వాటర్వర్క్స్లోని పాత ఫిల్టరేషన్ ప్లాంట్‌ను పునరుద్దరించారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి సంజీవ్‌నగర్ రైల్వేగేట్‌కు 900 ఎంఎం పైపు లైన్ కోసం రూ. కోటీ 15 లక్షలు, సంజీవ్‌నగర్ రైల్వే గేట్ వద్ద ఇంటర్ కనెక్షన్‌కు రెండు కోట్ల రూపాయలు, నగరంలో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు రూ. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నగరంలో కొత్త పైపులైన్లు ఇవి కాకుండా గుంటూరు నగరంలో ప్రధానమైన పైపులైన్లతో పాటు అంతర్గత పైపులైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. తాజాగా అమృత్ పథకం కింద రూ. 184 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి మంజూరు అయ్యాయి. కృష్ణానది పక్కన ఉండవల్లి నుంచి మంగళగిరి వరకూ పాత పైపులైన్ మార్చడంతో పాటు అదనంగా కొత్త పైపులైన్ వేశారు. మంగళగిరి నుంచి గుంటూరు నగరంలోని తక్కెళ్లపాడుకు, సంగం జాగర్లమూడి నుంచి గుంటూరు నగరానికి కొత్త పైపులైన్లు వేయడంతో పాటు అంతర్గత పైపులైన్లు మార్చేందుకు ఈ రూ. 184 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. వీటికి సంబం«ధించిన డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయి. వీటన్నింటిని మరుగునపెట్టి బురద జల్లడమే పనిగా పచ్చమీడియా పెట్టుకుంది. -
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
టీడీపీ నేతల అవినీతికి నిదర్శనమే నెల్లూరు రహదారులు
-
బిందెడు నీటికోసం పడిగాపులు!
సాక్షి, నల్లగొండ రూరల్ : బిందెడు తాగునీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఆ 6 గ్రామాల ప్రజలకు ఏర్పడింది. కృష్ణా తాగునీరు ఎప్పుడు వస్తుందా అని బిందెలు, క్యాన్లు పెట్టుకొని వృద్ధులు, చిన్నారులు ఎదురుచూస్తున్నారు. లక్షలు వెచ్చించి గ్రామాల్లో కృష్ణా తాగునీటి కోసం నిర్మించిన నీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. తాగునీటి ట్యాంకులకు కృష్ణా జలాలు చేరకపోవడంతో పైప్‌లైన్‌కు నల్లాను ఏర్పాటు చేసుకొని ప్రజలు నీటిని పట్టుకుంటుం న్నారు. నీటిసమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కావడంలేదని వెలుగుపల్లి, రసూల్‌పురం, ముశంపల్లి, గుట్టకింద అన్నారం, మేళ్లదుప్పలపల్లి, అన్నారెడ్డిగూడెం గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఓకేసారి నీటి సరఫరా: మండలంలోని 6 గ్రామాలకు కృష్ణా తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలే దు. వారానికి ఒకసారి నీటి ని సరఫరా చేస్తుండడంతో గ్రా మస్తులు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండకు వచ్చి నీటిని కొ నుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతోపాటు తాగునీటికి ఇ బ్బందులు తప్పడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. చర్లగౌరారం ప్లాంట్ నుంచి నీటి సరఫరా: చర్లగౌరారం కృష్ణా వాటర్ ప్లాంట్ నుంచి నల్లగొండ మండలంలోని 6 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నీటి సరఫరా ఎందుకు చేయడంలేదని అధికా రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎప్పుడు అడిగి నా రేపటినుంచి సరఫరా చేస్తామని చెబుతున్నారే తప్ప అధికారుల పనితీరులో మార్పు ఉండటంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులకు నల్లాల బిగింపు: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్యాంకులకు కృష్ణా జలాలు సరఫరా చేయకపోవడంతో గ్రామస్తులు వాటర్ పైప్‌లైన్‌కు నల్లా ఏర్పాటు చేసుకున్నారు. 6 గ్రామాల్లో అనధికారికంగా నల్లా ఏర్పాటు చేసకుని కృష్ణా నీటిని బిందెల్లో పట్టుకుంటున్నారు. నీటిసరఫరా బంద్ కావడంతో నిల్వ ఉన్న మురికి నీరు తాగునీటి పైపుల్లోకి వెళ్లి కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్య తీసుకుని నీటిఎద్దడి ఉన్న గ్రామాలపై దృష్టి సారించి ప్రతిరోజు కృష్ణా జలాలు సరఫరాచేయాలని ప్రజలు కోరుతున్నారు. నీళ్లు రాక 5రోజులైంది కృష్ణా తాగునీరు సరఫరా లేక 5రోజులైంది. దీంతో బావులవద్ద నీటిని పట్టుకొని వస్తున్నాం. ఒక్క ట్యాంక్‌కు కూడా కృష్ణా జలాలు ఎక్కడం లేదు. నీటిసమస్యను ఎవరు పట్టించుకోవడంలేదు. నీళ్లు పెట్టేందుకు వచ్చిన వారికి చెప్పితే వస్తయి అంటున్నారు. – విమల, వెలుగుపల్లి క్యాన్ నీళ్ల కోసం తిప్పలు క్యాన్ వాటర్ కోసం నల్లగొండకు పోవడం వల్ల వ్యవసాయ పనులకు ఇబ్బందిగా మారింది. నల్లా ఎప్పుడు వస్తదో తెలియక రెండు బిందెలు నల్లా వద్ద పెట్టి పిల్లలను అక్కడ ఉంచి పనులకు పోతున్నాం. ఏనాడు సక్కంగా నీరు రావడంలేదు. – పద్మ, వెలుగుపల్లి -
ఇకపై నో సిలిండర్
తిరువొత్తియూరు: చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు ఆయిల్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఆయిల్ సంస్థ నిర్వాహక అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటి ఉపయోగానికి, హోటళ్లకు వేర్వేరు పరిమాణంలో ఉన్న సిలిండర్లలో వంటగ్యాస్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు. తమిళనాడులో కోటిమందికి పైగా వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నూరులో సహజవాయువు పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన వెంటనే చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్ ఏర్పాటుచేసి వంటగ్యాస్ సరఫరా చేసేందుకు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇళ్లకు ప్రత్యేకంగా మీటర్లు బిగించి వంటగ్యాస్ వినియోగించిన మేరకు నగదు వసూలు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా సిలిండర్లకు బుకింగ్ చేయడం, ఆలస్యం వంటి సమస్యలు ఉండవన్నారు. -
పైపులైనే రహదారి
ఫతేనగర్ శివాలయం రోడ్డు నాలాపై ఉన్న పైప్‌లైనే వారికి దారి..స్థానికులు దానిపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఫతేనగర్ నుండి బాలనగర్‌కు వేళ్లే కార్మికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. బ్రిడ్డి పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య నెలకొంది. గతంలో అనేకమంది ఇందులో పడి గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. – ఫొటోలు : నోముల రాజేష్ రెడ్డి -
గుంటూరుకు మరో గండం!
మంగళగిరిటౌన్: గుంటూరు పట్టణానికి మరో గండం పొంచి ఉంది. విజయవాడ నుంచి తాగునీటిని అందించే పైప్లైన్లకు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో జంతువులు సంపుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. తాజాగా కాలువ గట్టున పచ్చగడ్డికోసం వెళ్లిన గేదెలు గుంటూరు చానల్లోకి దిగి మంగళవారం ప్రమాదవశాత్తు మృతి చెందాయి. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు నగరానికి తాగునీరు అందించడానికి గుంటూరు చానల్‌ను ఉపయోగిస్తున్నారు. గుంటూరు చానల్ ద్వారా 2 రకాలుగా నీటిని గుంటూరు పట్టణానికి అందిస్తున్నారు. కాలువ ద్వారా నీటిని వర్షాకాలంలో గుంటూరు పట్టణానికి అందిస్తే, వేసవి కాలంలో గుంటూరు చానల్ వెంట అంతర్గతంగా భూమిలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇక్కడ అంతర్గతంగా వేసిన పైప్లైన్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్త, వ్యర్థపదార్థాలను తీసేందుకు కొంత దూరంలో సంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ సంపుల్లో పైన ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా గుంటూరు మున్సిపల్ అధికారులు వదిలేశారు. అంతర్గత పైప్లైన్లు ప్రారంభంలో లాకులకు గ్రిల్స్ కాని, ఇనుప చువ్వలు కానీ ఏర్పాటు చేయకుండా పైప్లైన్లు ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో మంగళగిరి పట్టణం ద్వారకానగర్ నివాసి దేవరాల నారాయణకు చెందిన 7 గేదెలు తాగునీటికోసం గుంటూరు చానల్ వద్దకు వచ్చాయి. ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో అధికవేగంతో ప్రవహిస్తున్న కాలువలో పడి తూము ద్వారా సంప్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాయి. ఈ సంఘటనను గమనించిన పశుకాపరులు, స్థానికులు హుటాహుటిన వచ్చి 7 గేదెల్లో 5 గేదెలను పక్కనే నిర్మాణం జరుగుతున్న సంస్థ క్రేన్ సహాయంతో బెల్టులు కట్టి ఒడ్డుకు చేర్చారు. రెండు మాత్రం సంప్ నుంచి నేరుగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లో ఇరుక్కుపోయి నీటి ప్రవాహానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న సంప్‌లలో ఒక్కొక్కటి వేరువేరుగా నీటిపై తేలియాడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి తహసీల్దార్ వసంతబాబు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి, జరిగిన నష్టం గురించి, రక్షణచర్యల గురించి మాట్లాడకుండా, పశుకాపర్ల మీద కోప్పడటం గమనార్హం. ఈ సంప్ నుంచి గేదెలను తీయాలంటే సంప్‌లను పగలగొట్టి చనిపోయిన గేదెలను తీయాల్సిందే. సాయంత్రానికి గుంటూరు మున్సిపాలిటీ యంత్రాంగం వచ్చి సంపులను పగులగొట్టి మృతిచెందిన గేదెలను వెలికి తీశారు. సుమారు రూ. 2.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పశువుల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. -
పొలాల్లో ‘పైపుల’ బాంబు
సాక్షి, అమరావతి: అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టింది. జీవనాధారమైన భూమిపై రైతులకున్న హక్కును లాగేసుకోవడానికి సిద్ధమైంది. భూసేకరణ చట్టం–2013ను తుంగలో తొక్కుతూ మరో బిల్లు తీసుకొచ్చింది. సాగునీటి ఎత్తిపోతల పథకాలు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద పైప్లైన్లు వేయడానికి అవసరమైన భూమిని సేకరించకూడదని నిర్ణయిం చింది. కేవలం ఆ భూమిపై రైతుల హక్కులను సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేసింది. ఇందుకోసం మార్కెట్ విలువలో కేవలం పది శాతం మాత్రమే రాయల్టీగా చెల్లించి భూమిపై రైతుల హక్కును సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నింది. కలెక్టర్ ఇచ్చిందే పరిహారమని స్పష్టం చేసింది. దీనిపై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేసింది. ఒకవేళ రైతుల భూముల్లో వేసిన పైప్లైన్లకు పొరపాటున నష్టం వాటిల్లితే సంబంధిత రైతులను మూడేళ్ల పాటు జైలుకు పంపాలంటూ నిబంధనలు తీసుకొ చ్చింది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్‌లైన్స్ చట్టం–2018’ ముసాయిదాను మంగళవారం హడావుడిగా మంత్రులకు పంపించి ఆమోదముద్ర వేయించింది. శాసనసభ సంప్రదాయాలు, నియమావళిని కాలరాస్తూ బుధవారం ఈ బిల్లును అప్పటికప్పుడు సభలో ప్రవేశపెట్టి.. క్షణాల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయించుకుంది. తద్వారా కర్షకుల నడ్డివిరిచింది. రైతుల జీవితాలతో చెలగాటం.. రాష్ట్రంలో గోదావరి–పెన్నా అనుసంధానం, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల వంటి సాగునీటి పథకాలతో పాటు గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పథకాల్లో భాగంగా పైప్లైన్లు వేయడానికి అవసరమైన భూమిని సేకరించకుండా.. భూమిపై రైతులకున్న హక్కులను మాత్రమే సొంతం చేసుకోవాలని నిర్ణయించింది. భూమికి ఉన్న మార్కెట్ విలువలో పది శాతం రాయల్టీగా చెల్లించడం ద్వారా రైతుల హక్కులను దక్కించుకోవాలని భావించింది. అంటే ఎకరం మార్కెట్ విలువ రూ.లక్ష ఉంటే.. రైతుకు రూ.పది వేలు మాత్రమే చెల్లించి, ఆ భూమిపై ఉన్న హక్కును లాగేసుకోవడమన్న మాట. తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని భావించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్‌లైన్స్ చట్టం–2018 బిల్లు తీసుకొచ్చింది. సాగునీటి ఎత్తిపోతల పథకాలు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అలైన్మెంట్ ప్రకారం పైపులైన్ వెళ్లే మార్గంలో భూములను సంబంధిత రైతులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సర్వే చేసే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కట్టబెట్టింది. సర్వే పూర్తయిన తర్వాత భూమి హక్కును సొంతం చేసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ నియమించే అధికారి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసిన అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. పైప్లైన్లకు నష్టం కలిగితే మూడేళ్ల జైలు! రైతులకు భూమిపై ఉన్న హక్కులను సొంతం చేసుకోవడం కోసం మార్కెట్ విలువలో 10 శాతాన్ని కలెక్టర్ రాయల్టీగా నిర్ణయిస్తారు. ఈ రాయల్టీ సంతృప్తికరంగా లేకపోతే న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. అదే సమయంలో పైపులైన్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లినా కూడా సంబంధిత రైతులను మూడేళ్ల పాటు జైలులో పెట్టడం లేదా భారీగా జరిమానా విధించి శిక్షించేలా నిబంధన తీసుకొచ్చింది. అలాగే కోర్టు విచారణలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించిన రాయల్టీని సంబంధిత కోర్టుల్లోనే డిపాజిట్ చేసి.. వాటి హక్కులను కూడా సర్కార్ సొంతం చేసుకుంటుంది. శాసనసభ సంపద్రాయాలు, నియమావళి అపహాస్యం.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. అయినా కూడా ముసాయిదాను మంత్రులకు పంపి ఆగమేఘాలపై ఆమోదముద్ర వేయించారు. శాసనసభ నియమాలు, సంప్రదాయాల ప్రకారం బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని అజెండాలో చేర్చుతారు. అజెండా ప్రకారం అదే రోజున బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి, ప్రతులను సభ్యులందరికీ అందిస్తారు. ఆ మరుసటి రోజుగానీ లేదా రెండు, మూడు రోజుల తర్వాత గానీ బిల్లుపై చర్చ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏవైనా లోటుపాట్లు ఉంటే.. సభ్యులకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్‌లైన్స్ చట్టం–2018 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అంశాన్ని బుధవారం అజెండాలో చేర్చలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం హడావుడిగా బిల్లును సభలో ప్రవేశపెట్టి.. నిమిషాల వ్యవధిలోనే చర్చ నిర్వహించి ఆగమేఘాలపై ఆమోదముద్ర వేయించుకుంది. దీనిపై పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి విమర్శలు చెలరేగాయి. భూసేకరణ చట్టం–2013 ప్రకారమైతే.. ఇప్పటివరకూ సాగునీటి ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాల పనుల్లో భాగంగా పైపులైన్లు వేసేందుకు అవసరమైన భూమిని.. ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారమే ప్రభుత్వం పరిహారం చెల్లించి సేకరించాల్సి వస్తోంది. ఈ చట్టం ప్రకారం మార్కెట్ విలువ కన్నా రెండున్నర రెట్లు అధికంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భూమి సేకరించాల్సిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ.పది లక్షలుంటే.. రెండున్నరెట్లు అధికంగా అంటే రూ.35 లక్షలు పరిహారంగా చెల్లించాలి. అయితే దీనివల్ల ఆర్థిక భారం ఎక్కువ అవుతుందంటూ.. రైతుల నోళ్లు కొట్టేందుకు తాజా బిల్లు ద్వారా సర్కార్ కుట్ర పన్నింది. చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనం.. సీఎం చంద్రబాబుకు రైతులపై ఎంత కక్ష ఉందో ఈ బిల్లు ద్వారా అర్థమవుతోంది. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెడుతూ కమీషన్లు దుండుకోవడానికైతే ఖజానాలో నిధులు ఉంటాయా? రైతులకు పరిహారం ఇచ్చేటప్పుడు మాత్రం నిధులు ఉండవా.. ఇదెక్కడి న్యాయం? భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాల్సిందే. పైప్‌లైన్‌కు నష్టం వాటిల్లితే రైతులనే బాధ్యులను చేసి.. మూడేళ్లు జైల్లో పెడతామనడం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనం. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు రైతుల బాధలు ఏం తెలుస్తాయి? లక్షలాది ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతూ, కమీషన్లు వసూలు చేసుకుంటూ సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు రైతుల బాధలు ఎలా తెలుస్తాయి? అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రతిపక్షం లేనప్పుడు సభలో ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకోవడాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులతో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. ఈ బిల్లుపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. – రావుల వెంకయ్య, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం.. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పైపులైన్లు వేసుకున్న భూమికిగానూ అక్కడి ప్రభుత్వాలు 40 శాతం పరిహారం, పంట నష్టం చెల్లిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పది శాతాన్ని మాత్రమే రాయల్టీగా చెల్లించాలని నిర్ణయించడం దారుణం. పైప్‌లైన్ పగిలితే రైతులను జైళ్లలో పెడతారా? లోపభూయిష్టమైన ఈ బిల్లుపై న్యాయపోరాటం చేస్తాం. రైతులకు అన్యాయం చేస్తే చూస్తు ఊరుకోం. బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. – కేశవరావు, సీపీఎం నాయకుడు -
వంటింట్లోకి గ్యాస్
వంటింట్లో గ్యాస్ కష్టాలు నగరంలోని ప్రతి ఒక్కరికీ అనుభవమే. పండగ సీజన్లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఇకపై ఈ కష్టాలకు ఫుల్స్టాప్ పడనుంది. ఇప్పటికే నగర శివారులోని గేటెడ్ కమ్యూనిటీలకు పైప్‌ల ద్వారా వంటింటికే గ్యాస్‌ను సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ.. కోర్ సిటీలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనుంది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. తాజాగా చింతల్, బాలాగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బల్కంపేట్, వరకు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో 30 కి.మీ పొడవునా పనులు పూర్తి చేసి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను అందించాలని యోచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ఇంటింటీకి పైపులైన్ వంట గ్యాస్ వచ్చేస్తోంది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ.. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా పైపులైన్ల విస్తరణ పనులను వేగిరం చేస్తోంది. నగర శివారులోని శామీర్‌పేట మదర్ స్టేషన్ సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్‌కు పరిమితమైన వంటగ్యాస్ సరఫరాను కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలకు విస్తరింపజేసింది. తాజాగా చింతల్, బాలనగర్, బల్కంపేట కూకట్పల్లి వరకు పైపులైన్ పనులు పూర్తి చేసి వంట గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు సిద్ధమైంది. మరో ఏడాదిలో సుమారు 30 కిలో మీటర్ పొడవునా అల్వాల్, బొల్లారం, ఫతేనగర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్, ప్యాట్ని. షేక్‌పేట, మదీనాగూడ, బల్కంపేట, నిజాంపేట, ప్రగతి నగర్ వరకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం శ్రీకారం.. హైదరాబాద్ మహానగరంలో ఇంటింటీకి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ ఆరేళ్ల క్రితం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ప్రాజెక్టులో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా 2014 ఎప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేయాలని భావించినప్పటికీ.. ఈ డిసెంబర్ నాటికి 2,706 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే అందించగలిగింది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్ సమీపంలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్రలలో కనెక్షన్లు అందించింది. రూ.733 కోట్లతో.. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్లలో సుమారు రూ.733 కోట్లు ఖర్చుతో పైపులైన్ పనులు విస్తరించాలని భావించినట్లు బీజేఎల్ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని ప్రణాళిక రూపొందించి ఇప్పటి వరకు 34 కిలో మీటర్ల పనులు మాత్రమే పూర్తి చేయగలిగింది. వాస్తవంగా గ్రిడ్ నుంచి సరైన గ్యాస్సరఫరా లేక, ఆ తర్వాత పైపులైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ లేకపోవడం పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా స్టీల్ పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ కమ్యూనిటీలకు.. నగరంలోని గ్రేటర్ కమ్యూనిటీలకు పైప్‌లైన్ వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ఇప్పటికే నగరం శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్ అపార్టుమెంట్, జయభేరి, వెన్సాయి, ఎన్సిఎల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్దనగర్, వెంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్సిఎల్ నార్త్, మీనాక్షి ఎన్క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్, శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మికాలనీ, జయరాంనగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కష్ణకుంజ్ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్ ప్రాంతాలకు పైప్‌లైన్‌ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వినియోగదారులు ఎంత గ్యాస్ వాడుకుంటే అన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు ప్రతిరోజు 0.5 ఎంసిహెచ్ గ్యాస్ వాడే అవకాశముందని బీజేఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
తూములతో.. కరకట్టకు తూట్లు
అది 2009 అక్టోబర్.. 10.94 లక్షల క్యూసెక్కుల వరద నీటితో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కరకట్టను తెంచుకుని గ్రామాలపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయల పంట, ఆస్తి నష్టం వాటిల్లాయి. కొందరు స్వార్థంతో కృష్ణానది కరకట్టకు మధ్యలో పైపులైన్లు వేయటం వల్లే భారీ నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. భట్టిప్రోలు మండలం ఒలేరు పల్లెపాలెం వద్ద కరకట్ట కోతకు గురవడానికి కారణం ఇదేనని కనుగొన్నారు. భట్టిప్రోలు నుంచి లంకెవానిదిబ్బవరకు సుమారు వంద చోట్ల కరకట్టకు మధ్యలో పైపులైన్లు ఉన్నట్లు తేలింది. మళ్లీ...ఇప్పుడు కృష్ణానదికి పెను ముప్పు పొంచి ఉంది. పైపులైన్లు కాదు ఏకంగా నది ఒడ్డునే గోతులు తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. రేపల్లె : కొందరి స్వార్థం అందరికి పెనుముప్పును తెచ్చిపెడుతోంది. నదీపరివాహక ప్రాంతంలో మనుగడను ప్రమాదకరంగా మారుస్తోంది. నదీప్రవాహం, కరకట్టకు మధ్య ఉన్న లంకభూముల్లో భారీ గోతులు తవ్వుతున్నారు. సాగు పేరుతో రక్షణ కవచాలకు విచక్షణ రహితంగా గునపాలు గుచ్చుతున్నారు. కృష్ణా కరకట్టల మధ్య తూములు ఏర్పాటు చేస్తూ కట్టలను బలహీనపరుస్తున్నారు. లంక భూముల్లో భారీ గోతులు తవ్వి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే కాస్తంత వరద నీరు వచ్చినా లంక భూములు భారీ కోతకు గురై కరకట్టను తాకేంత ప్రమాదానికి చేరుకుంది. భారీ గోతులు... మండలంలోని పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలోని లంక భూముల్లో 12 నుంచి 15 అడుగుల వరకు భారీ గోతులు తవ్వి మట్టిని తరలించారు. నదీ ప్రవాహానికి నాలుగుమీటర్ల దూరంలోనే భారీ గోతులు తవ్వారు. పలుచటి గోడలా మాత్రమే కరకట్ట మిగిలింది. మట్టి తరలించిన భూమిలో కూడా చెరువులు, పంటలు వేసేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. సాగుభూమి, చెరువులుగా మార్చిన భూమిలో నుంచి నదీ ప్రవాహానికి నడుమ తూములు కూడా ఏర్పాటు చేశారు. నదీ ప్రవాహం కాస్తంత ఎక్కువైనా పలుచగా మారిన కట్టలు, లంకభూమి కోతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. నిరంతరం నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారధికి కూడా ముప్పే.. తీరప్రాంత ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన పెనుమూడి-పులిగడ్డ వారధికి సైతం అక్రమార్కుల ఫలితంగా ముప్పు పొంచి ఉంది. కృష్ణానదికి వరదలు వచ్చే సమయంలో లంకభూములు వరద తాకిడికి కోసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వారధి వద్ద కూడా భూమి కోతకు గురై వంతెనకు పెను ముప్పే వాటిల్లేప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లెకు సుస్తీ
ఆత్మకూర్/అలంపూర్, న్యూస్‌లైన్: అసలే ముసురు వర్షాలు.. అపై పారిశుధ్యం పడకేయడంతో పల్లెలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరి చొప్పున అతిసార, మలేరియా బారినపడి తల్లడిల్లిపోతున్నారు. ఒంట్లో సత్తువలేక..ఆస్పత్రికి మంచానికే పరిమితమవుతున్నారు. వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నా.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తగిన చర్యలు చేపట్టలేకపోతున్నారు. నీటిని సరఫరా చేసే పైప్లైన్లు కలుషితమవడం, క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టకపోవడం వల్లే అతిసార ప్రబలిందని బాధితులు వాపోతున్నారు. కాగా, గతవారం రోజుల్లో జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడగా, వంద మందికి పైగా అతిసారరోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మంగళవారం ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్లోలో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన చిన్న మణెమ్మ, నాగేశ్వరి, శ్రీను, సులోచన, పెద్ద మణెమ్మ, సరోజ, వెంకటేష్, మాసూం, బాలకిష్టన్న, మణెమ్మ, వెంకటన్న, మాలన్బీకి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే గ్రామంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో మరికొందరు చికిత్సపొందగా.. మరికొందరు పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు. తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, ఎంపీడీఓ శరత్చంద్రబాబు, ఈఓపీఆర్డీ రఘునాథ్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ గ్రామాన్ని సందర్శించి అతిసార బాధితులకు చికిత్స అందితున్న తీరును పరిశీలించారు. చిట్యాలలో అదుపులోకి రాని అతిసార మక్తల్ రూరల్: మండలంలో అతిసార విజృంభిస్తోది. చిట్యాలలో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మంగళవారం మంతన్గోడుకు చెందిన ఇద్దరు, రుద్రసముద్రం గ్రామానికి చెందిన ఒకరు, నేరడుగంకు చెందిన మరో ఇద్దరు, కర్ని గ్రామానికి మరో ఇద్దరు..ఇలా ఎనిమిది మంది అతిసారబారిన పడ్డారు. వీరిని కుటుంబసభ్యులు వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు స్థానిక ఆర్ఎంపీల వద్ద చికిత్సపొందుతున్నారు. అలంపూర్‌లో 10మందికి..అలంపూర్, న్యూస్‌లైన్: మండలంలోని వివిధ గ్రామాల నుంచి అతిసార రోగులతో అలంపూర్ ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడింది. కాశీపురం గ్రామానికి చెందిన తులసమ్మ, పద్మావతిలు రెండురోజులుగా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని అక్బర్‌పేటకు చెందిన పరమేష్ అనే విద్యార్థి వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిపాలయ్యాడు. రాము అనే యువకుడు కూడా అతిసారతో ఆస్పత్రిలో చేరాడు. అలాగే బుక్కాపురం, కోనేరు, కాశీపురం, ఇమాంపురం, అలంపూర్ గ్రామాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. కాగా, ప్రతిరోజు అతిసారంతో ఐదు నుంచి ఎనిమిది ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.