
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దివాకర్‌రెడ్డి మరణవార్త తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. కాగా దివాకర్‌రెడ్డి మరణం పట్ల ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.
ప్రగాఢ సానుభూతి ప్రకటించిన దేవులపల్లి
సజ్జల దివాకర్ రెడ్డి మృతికి నా ప్రగాఢ సంతాపం. సోదరుడిని కోల్పోయిన ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డికి, వారి కుటుంబానికి నా సానుభూతి. సోదరులిద్దరూ నాకు చిరకాల వ్యక్తిగత మిత్రులు -దేవులపల్లి అమర్ , జాతీయ మీడియా సలహాదారు, ఏ పీ ప్రభుత్వం.
(చదవండి: కమ్ముకున్న పొగలో కడతేరిన జీవితాలు)
Comments
Please login to add a commentAdd a comment