diwakar reddy
-
సజ్జల సోదరుడు దివాకర్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, అమరావతి/బంజారాహిల్స్/కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త సజ్జల దివాకర్‌రెడ్డి(66) కన్నుమూశారు. దివాకర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహానికి తరలించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డికి అల్లుడైన దివాకర్‌రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సహ విద్యార్థి కూడా. ఈయనకు సతీమణి భగీరథమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకున్నారు. దివాకర్‌రెడ్డి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇంకా దేవులపల్లి అమర్, ఏకే.ఖాన్, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. సాయంత్రం 5 గంటలకు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటినుంచి ప్రారంభమైంది.మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. -
సజ్జల సోదరుడు దివాకర్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దివాకర్‌రెడ్డి మరణవార్త తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. కాగా దివాకర్‌రెడ్డి మరణం పట్ల ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించిన దేవులపల్లి సజ్జల దివాకర్ రెడ్డి మృతికి నా ప్రగాఢ సంతాపం. సోదరుడిని కోల్పోయిన ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డికి, వారి కుటుంబానికి నా సానుభూతి. సోదరులిద్దరూ నాకు చిరకాల వ్యక్తిగత మిత్రులు -దేవులపల్లి అమర్ , జాతీయ మీడియా సలహాదారు, ఏ పీ ప్రభుత్వం. (చదవండి: కమ్ముకున్న పొగలో కడతేరిన జీవితాలు) -
'ఏపీలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ'
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత నెలకొన్నదని తెలిపిన ఆయన ఏపీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కూర్చుని ఉండటం, పాలన మాత్రం హైదరాబాద్ నుండి కొనసాగుతుండటం ఈ స్తబ్థతకు కారణంగా వివరించారు. రాష్ట్రంలో మరో ఏడాది కాలం ఇదే పరిస్థతి కొనసాగితే ప్రజల నుండి తీవ్రమైన అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు మాత్రం ఎక్కువగా ఉందన్నారు. కేవలం రాజకీయనిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారని జేసీ ఎద్దేవా చేశారు. -
అధికారులపై మంత్రి అసహనం
సమన్వయంతో పనిచేయాలని ఆదేశం సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం సర్వజనాస్పత్రిలో సమీక్షా సమావేశం అనంతపురం మెడికల్: నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారులపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్, హెచ్ఓడీలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైద్యులు..మేధావులు, విద్యావంతులైన మీ మధ్య సమన్వయ లోపమెందుకని ప్రశ్నించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిశుభ్రత లేనికారణంగానే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని ఆర్ఎంఓతో ఆరా తీశారు. సానిటేషన్ పనులు సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఎంపీ ఆదేశించారు. చేతకాకపోతే మానుకోవాలన్నారు. వైద్యుల కొరత ఉందని, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒక్కరూ లేరని మంత్రి అడిగిన ప్రశ్నకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సమాధానంగా చెప్పారు. ఎంపీ జేసీ కలుగజేసుకుని సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేసే బాధ్యత మంత్రి తీసుకోవాలని కోరారు. అందుకు ఈ నెల 15న జరిగే కేబినెట్లో మాట్లాడుతామన్నారు. సమావేశంలో మేయర్ స్వరూప, హెచ్ఓడీలు సంపత్ కుమార్, మల్లేశ్వరి, యండ్లూరీ ప్రభాకర్, రామస్వా మి నాయక్, జేసీ రెడ్డి, నవీన్, పెంచలయ్య, సంధ్య, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం ‘హెచ్‌డీఎస్ సమావేశం జరిగినప్పటి నుంచి మూడుసార్లు నాతో సమావేశమయ్యారు.. కానీ ఎందుకు పనులు పూర్తి కాలేదు.. కనీసం ఈ సమస్య ఉందని ఎందుకు తెలుపలేదు..’ అని సూపరింటెండెంట్‌పై కలెక్టర్ మండిపడ్డారు. వాషింగ్ మిషన్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాడాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. కొటేషన్ వేస్తున్నామని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. ప్రతిరోజూ సిబ్బందితో మాట్లాడి పర్యవేక్షించాలని సూచిం చారు. సమావేశం అనంతరం కలెక్టర్ సీరియస్‌గా వెళ్లిపోయారు. -
జగన్ సీఎం అరుుతే సువర్ణ పాలన
ఉరవకొండ రూరల్, న్యూస్‌లైన్: కరువు పీడిత అనంతపురం జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తిరిగి వుహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణపాలన రావాలంటే వైఎస్ఆర్సీపీని భారీ గెలిపించాలని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. రోడ్ షోలో భాగంగా స్థానిక క్లాక్‌టవర్ వద్ద సోమవారం నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. వై.విశ్వేశ్వరరెడ్డి వూట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే హంద్రీనీవా రెండవ దశ పనులు పూర్తి చేసి నియోజకవర్గ వ్యాప్తంగా 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తావున్నారు. చేనేత కార్మికులకు ఆదుకుంటావున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని వురచిన కేశవ్‌కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా వున్నారన్నారు. అనంతవెంకట్రామిరెడ్డి వూట్లాడుతూ జిల్లాలో యుువతకు ఉపాధి అవకాశాలతోపాటు పరిశ్రవుల స్థాపనకు కృషి చేస్తావున్నారు. చేనేత కార్మికులకు చేయుూతనందిస్తామన్నారు. వూజీ వుంత్రి దివాకర్‌రెడ్డి వంటి దౌర్జన్యపరులతో జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నారు. సీఈసీ సభ్యుడు వై.వుధుసూదన్‌రెడ్డి వూట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఒక్కడైన చూపగలరా అని ప్రశ్నించారు. ఆయన తన వ్యాపారా లావాదేవీలతో కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. వూజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి వూట్లాడుతూ టీడీపీ అభ్యర్దులు కేశవ్, జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరు తోడు దొంగలని, జిల్లాను పెద్ద ఎత్తున దోచుకోడానికి వారు పోటీలో నిలబడ్డార న్నారు. కాంగ్రెస్‌లో వున్న జేసీతో దోస్తీ కట్టిన కేశవ్ ఆయనను టీడీపీలోకి తీసుకొచ్చి దొంగల వుుఠాగా వూరారని ఎద్దేవా చేశారు. కార్యక్రవుంలో జిల్లా వుహిళా విభాగం కన్వీనర్ బోయు సుశీలవ్ము, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శివన్న, వూర్కెట్ యూర్డు చైర్మన్ రవుణయూదవ్, పట్టణ కన్వీనర్ బసవరాజు, వజ్రకరూర్ సింగిల్ విండో అధ్యక్షుడు వడ్డేవుహేష్, చాకలి నాగేశ్వరావు, కాకర్ల నాగేశ్వరావు, గ్రంథాలయు వూజీ చైర్మన్ ఫకృద్దీన్, వజ్రకరూర్ నాయుకుడు నవీన్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, మైనార్టీ జిల్లా నాయుకులు శర్మాస్ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షులు తిప్పయ్యు, వూజీ ఎంపీపీ ఎసీ ఎర్రిస్వామి పాల్గొన్నారు. -
సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ
సోనియా గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కేజ్రీవాల్ వస్తాడని.. ఆయనెవరనేది తొందరలోనే తెలుస్తుందన్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలిలో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడారు. ‘‘సోనియాపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని బహిష్కరించాలంటున్నారు. పార్టీ మారనున్నారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. బహిష్కరించిన తర్వాత చూస్తా.. వేచి చూడండని బదులిచ్చారు. -
నన్ను రానివ్వద్దనడానికి వాడెవడు?: జేసీ
కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలోకి (సీఎల్పీలోకి) నన్ను రానివ్వద్దనడానికి వాడెవడు? అంటూ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం సీఎల్పీ కార్యాయానికి వస్తున్న సమయంలో ‘మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించాలని చాలా మంది నేతలు అంటున్నారు’ అని కార్యాలయం బయట కొందరు విలేకరులు గుర్తు చే సినపుడు, జేసీ ఇలా స్పందించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ముందు బొత్సను సస్పెండ్ చేయాలి: జేసీ
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ క్షీణదశకు వచ్చిందన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో కలిసి కేంద్ర మంత్రులు, ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాతే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజనకు దారితీసిన పరిస్థితులను వివరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జేసీ అభిప్రాయపడ్డారు. ‘సోనియా గాంధీని నేనేనాడూ కించపరచలేదు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి, పదవి నుంచి తప్పుకుని మంచి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరాను. ఇందులో ఏమైనా బూతులు ఉన్నాయా?’ అని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. -
దివాకర్ రెడ్డిని బహిష్కరించి పారేస్తా!
పీసీసీ చీఫ్ బొత్స తీవ్ర ఆగ్రహం ఆయనేమైనా పెద్ద పుడింగా? షోకాజ్ నోటీస్ కూడా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తామని, అహంకారంతో, దొరతనంతో మాట్లాడుతున్న జేసీకి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ అడగాల్సిన అవసరం కూడా లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోనియాను విమర్శించినంత మాత్రాన పెద్ద పుడింగి అవుతాననే భావంతో జేసీ ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బొత్స మంగళవారం ఇక్కడ తన నివాసంలో మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలి.పార్టీలోనే ఉండాలంటూ ఆయనను ఎవరూ బతిమిలాడ్డం లేదు. పార్టీ నాయకత్వం నుంచి సోనియాగాంధీని తప్పించాలనడం చాలా తప్పు. ఇది సహించరానిది. ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరంలేదు. పార్టీ నుంచి బహిష్కరిస్తాం. ఈ మేరకు హైకమాండ్‌కు కూడా లేఖ రాశాను’ అని పేర్కొన్నారు. జేసీ తమ్ముడు ప్రభాకర్‌రెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా పార్టీలో ఉన్నారనే భావనతో సహించామని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ప్రవేశపెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చిరంజీవి కూడా తనతో చెబుతూ బాధపడ్డారని చెప్పారు. ఎంపీలపై చర్యల విషయం హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ హైకమాండ్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ ధిక్కారం కాదని బొత్స అన్నారు. వాటిని ఆవేదనతో కూడిన వ్యాఖ్యలుగానే పరిగణించాలన్నారు. ఎవరి అభిప్రాయం వారిదే అసెంబ్లీలో విభజన బిల్లు చర్చకు వస్తే సభ్యులు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తాను కూడా విభజనను వ్యతిరేకిస్తానన్నారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా? ఉండదా? అనే విషయం తనకు తెలీదని, అసెంబ్లీ బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్‌కు వస్తున్న పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీ నేతలెవరైనా కలవొచ్చని బొత్స స్పష్టం చేశారు. దిగ్విజయ్ 13న ఢిల్లీ వెళ్తారన్నారు. ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ విభజన చేస్తోందని విమర్శిస్తున్న చంద్రబాబు సమైక్యం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘రాయలసీమలో పుట్టి ఆంధ్రా అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు విభజనకు అనుకూలంగా ఎలా లేఖ ఇచ్చావు? నిన్ను ఏ సముద్రంలో విసిరేయాలి? గోదావరిలో ముంచాలా లేక కృష్ణా నదిలో కలిపేయాలా?’ అని విరుచుకుపడ్డారు. జేసీ ఓ చీడపురుగు: ఆమోస్ జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడపురుగని, స్వార్థం కోసం ఆయన ఎంతటి నీచానికైనా దిగజార తారని ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. జేసీని వెంటనే డిస్మిస్ చేయాలన్నారు. జేసీపై చర్యలు తీసుకోవాలి: దామోదర్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డితో పాటు కేంద్రంలోని సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోనియాను దేవత అన్నవారే ఇప్పడు విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. -
అమ్మ మాటే వేదం: జెసి దివాకర్‌రెడ్డి
-
రాయల తెలంగాణ కోసం సోనియాను కలుస్తాం: దివాకర్ రెడ్డి
రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, దివాకర్ రెడ్డి అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చించారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం వల్ల న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, అనంతపురం, కర్నూలు జిల్లాలకే చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుండగా, మరికొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు. -
అగచాట్లలో హస్తం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఇన్నాళ్లూ వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నట్టేటా ముంచేసింది. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు చెట్టుకొకరు... పుట్టకొకరులా చెల్లాచెదురవుతున్నారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా... విభజన నేపథ్యంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా... రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మాత్రం చేతులెత్తేశారు. ఆయన రాజకీయ మనుగడ కోసం వలస బాట పడుతున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటున్న మంత్రి శైలజనాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మసలుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న నిర్ణయం తీసుకోగానే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఎగిసింది. 40 రోజులుగా ఉధృతంగా కొనసాగుతోంది. జిల్లాలో సమైక్య సెంటిమెంటు నానాటికీ బలపడుతోండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రజల మనోభావాల మేరకు సమైక్యాంధ్ర కోసం ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సరికొత్త డ్రామాలకు తెరతీశారు. తద్వారా ప్రజావ్యతిరేకతను తప్పించుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం సాధించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2009 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో ఒంటరిగా మారారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం ఆయన ఎత్తులు వేస్తున్నారు. సమైక్యవాదాన్నే విన్పిస్తోన్న జేసీ.. రాష్ట్ర విభజన ఖాయమైతే రాయలసీమను విభజించి అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనను డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా బలపరిచారు. వారిద్దరూ ఇప్పుడే జేసీ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో జేసీ ప్రత్యర్థి అయిన రెవెన్యూ మంత్రి రఘువీరా చేతులెత్తేశారు. రాష్ట్ర విభజన ఖాయమైతే జిల్లాలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని రఘువీరా భావిస్తున్నారు. జిల్లాలోని 14 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక రాజకీయాలపై మక్కువ చూపిస్తున్నారు. మడకశిర నియోజకవర్గానికి కూతవేటు దూరంలోని తుమకూరు లోక్‌సభ స్థానంపై కన్నేశారు. అక్కడి నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది జిల్లాలో రఘువీరా వర్గాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ వర్గంలోని నేతలు చెట్టుకొకరు పుట్టకొకరులా చెల్లాచెదురయ్యారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని ప్రకటిస్తున్నా.. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి లోక్‌సభ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మడకశిర ఎమ్మెల్యే కె.సుధాకర్ మాత్రం సమైక్యాంధ్రకు కట్టుబడి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌లో ఒక్కో నేత ఒక్కో నినాదం చేస్తోండటంతో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానమే విభజన నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెల్లుబుకుతోంది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో డ్రామాలు ఆడుతున్నారనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించకుండా... ఏ డ్రామాలాడినా కాంగ్రెస్ నేతలను విశ్వసించరని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. వారి వాదనతో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కూడా ఏకీభవిస్తూ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.