
సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ
సోనియా గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కేజ్రీవాల్ వస్తాడని.. ఆయనెవరనేది తొందరలోనే తెలుస్తుందన్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలిలో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడారు. ‘‘సోనియాపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని బహిష్కరించాలంటున్నారు. పార్టీ మారనున్నారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. బహిష్కరించిన తర్వాత చూస్తా.. వేచి చూడండని బదులిచ్చారు.