
'ఏపీలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ'
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత నెలకొన్నదని తెలిపిన ఆయన ఏపీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కూర్చుని ఉండటం, పాలన మాత్రం హైదరాబాద్ నుండి కొనసాగుతుండటం ఈ స్తబ్థతకు కారణంగా వివరించారు.
రాష్ట్రంలో మరో ఏడాది కాలం ఇదే పరిస్థతి కొనసాగితే ప్రజల నుండి తీవ్రమైన అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు మాత్రం ఎక్కువగా ఉందన్నారు. కేవలం రాజకీయనిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారని జేసీ ఎద్దేవా చేశారు.