
రాయల తెలంగాణ కోసం సోనియాను కలుస్తాం: దివాకర్ రెడ్డి
రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, దివాకర్ రెడ్డి అనంతపురం ప్రెస్క్లబ్లో సమావేశమై రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చించారు.
తెలంగాణ ప్రక్రియ ఆగదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం వల్ల న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, అనంతపురం, కర్నూలు జిల్లాలకే చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుండగా, మరికొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు.