Sakshi Telugu Breaking News: Online News Today 9th August 2022 - Sakshi
Sakshi News home page

Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Published Tue, Aug 9 2022 9:49 AM | Last Updated on Thu, Aug 11 2022 9:53 AM

Sakshi Telugu Breaking News Online Telugu News Today 9th August 2022

1. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్‌ జగన్‌ 
ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్‌ సందేశం విడుదల చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వెంకయ్య భావోద్వేగం  
పార్లమెంట్‌ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి?
బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఆ కారణం వల్లే ప్లాన్‌ ప్రకారం జీవన్‌రెడ్డికి పిస్టల్‌ గురిపెట్టి
ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డెవిస్‌ సోమవారం ప్రకటించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్‌
బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్‌’. 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో ‘లెస్‌ ప్రొఫెటీస్‌’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన చెప్పినవాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వీఆర్వోల అంశంపై తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చిన హైకోర్టు
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) ప్రక్రియ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు స్టే విధించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. రూ. 1.62 లక్షల కోట్ల విలువైన ఆస్తులు మోనిటైజ్‌,రాహుల్‌కి ఆస్తుల మోనిటైజ్‌ అంటే ఏంటో తెలుసా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 1.62 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులు మోనిటైజ్‌ (ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం లేదా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి మార్గం ద్వారా ఆదాయ సముపార్జన) సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పతకాల పట్టికలో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..!
బర్మింగ్‌హామ్‌లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్‌ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మొదట ప్రపోజ్‌ చేసింది ఎవరంటే..
వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రాణం తీసిన వాటర్‌ బాటిల్‌
తోటి విద్యార్థినులతో కలిసి.. సంతోషంగా పాఠశాలకు బయల్దేరింది. వెళ్లొస్తాను.. బై అంటూ అమ్మానాన్నకు చెప్పింది. ఆ పిలుపే వారికి చివరి పిలుపు అయ్యింది. అలా బయల్దేరిందో లేదో.. అంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement