అధికారులు తగిన ప్రతిపాదనలతో రావాలి
గనుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
కొరతను అధిగమించడానికి తవ్వకం, లోడింగ్‌లను ప్రైవేటుకు ఇద్దామని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: ఇసుక కొరత ఇంకా ఉందని, దీన్ని అధిగమించేందుకు రీచ్‌ల్లో తవ్వకం, లోడింగ్ ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయించే ప్రతిపాదనలతో తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వారికి ఇసుక రీచ్‌లను కేటాయించే వ్యవహారాలను జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డులు పెట్టి సరఫరా చేయాలన్నారు. ఉచిత ఇసుకను అందించడం కోసమే సీనరేజి ఛార్జీలను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు.
సీనరేజి, జీఎస్టీ రద్దు వల్ల ప్రభుత్వంపై భారం పడినా ఉచిత ఇసుక కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన గనుల శాఖాధికారులతో ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అ నుమతి ఇచ్చామన్నారు ఇందుకోసం స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మార్గాల్లో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దాన్ని నివారించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖే‹Ùకుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment