![Strict measures if students are harassed says Adimulapu Suresh - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/18/ADIMULAPU-SURESH.jpg.webp?itok=zFID_-1b)
సాక్షి, అమరావతి/గుమ్మలక్ష్మీపురం: విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించటం, వేధించడం తదితర చర్యలను ఉపేక్షించేది లేదని అటువంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాల ఘటనపై మంత్రి సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించడంతో విద్యాశాఖధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు స్వామినాయుడు ఉపాధ్యాయుడు సూర్యనారాయణను సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు..
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పలువురు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన హెచ్‌ఎం సీహెచ్ స్వామినాయుడిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మరో ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు ఆయన బాలేసు గ్రామాన్ని గురువారం సందర్శించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment