నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’  | Supreme Court Probe On Panchayat Elections Today | Sakshi
Sakshi News home page

నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’ 

Published Mon, Jan 25 2021 3:15 AM | Last Updated on Mon, Jan 25 2021 9:03 AM

Supreme Court Probe On Panchayat Elections Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారించనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది.

సప్లిమెంటరీ జాబితాలో తొలుత 39వ ఐటెమ్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండింది. అయితే ఆ ధర్మాసనం నుంచి ఈ పిటిషన్‌ను తొలగిస్తున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా పేర్కొంది. అనంతరం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ద్విసభ్య ధర్మాసనం జాబితాలో చేర్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement