మహిళపై టీడీపీ సర్పంచ్‌ దౌర్జన్యం | TDP Sarpanch Harassment On Women In Annamayya District | Sakshi
Sakshi News home page

మహిళపై టీడీపీ సర్పంచ్‌ దౌర్జన్యం

Published Sat, Apr 16 2022 9:19 AM | Last Updated on Sat, Apr 16 2022 2:50 PM

TDP Sarpanch Harassment On Women In Annamayya District - Sakshi

నారా లోకేశ్‌తో నాగరాజ(ఫైల్‌ఫోటో)

కలకడ : ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత చొరబడి నానా దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలకడ మండలం కలకడదొడ్డిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌ సోదరుడు, కె.దొడ్డిపల్లె సర్పంచ్‌ మద్దిపట్ల నాగరాజ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

బుధవారం  అర్థరాత్రి సమయంలో చరపల్లె. శ్రీనివాసులునాయుడు భార్య అలివేలమ్మను నిద్ర లేపి తనకు ఓటు వేయలేదని నానా దుర్భాషలాడి కత్తితో చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement