woman harrasment
-
ముంబైలో రెచ్చిపోయిన రాజ్ థాక్రే వర్గం.. మహిళకు ఘోర అవమానం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్ థాక్రే అనుచరులు ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఆగస్టు 28వ తేదీన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) నాయకుడు వినోద్ అర్గిలే నేతృత్వంలో ముంబా దేవి ఆలయం వద్ద ఎంఎన్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగ్ నిమిత్తం వెదురు కట్టెలను పాతారు. ఈ క్రమంలో ప్రకాశ్ దేవీ అనే మహిళ వారిని అడ్డుకుని తన షాపు ఎదుట వారి పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టవద్దని చెప్పింది. అయితే, సదరు మహిళ మాటలను లెక్కచేయకుండా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అనుచరులు.. హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దీంతో, సదరు మహిళ, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టి, తోసిపడేశారు. అంతటితో ఆగకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. కాగా, వారి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, జరిగిన విషయంపై బాధితురాల పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. An elderly woman was assaulted and abused by MNS workers in Mumbai. A woman namely Prakash Devi, runs a medical shop, MNS workers installed wooden poles in front of her medical which led to an argument. She requested to remove but MNS started assaulted her. pic.twitter.com/PNji8DxrIR — Meenu Thakur (@JournoMeenu) September 1, 2022 -
‘ఐ లైక్ యూ’ అంటూ మెసేజ్ పెట్టాడు.. పోలీసుల రిప్లై చూసి..
చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో.. తన పని తాను చూసుకోకుండా.. సోషల్ మీడియా ఉంది కాదా అని ఓ వివాహితకు ‘ఐ లైక్ యూ’ అని మెసేజ్ పెట్టాడు ఓ ప్రబుద్దుడు. ఎవరో తెలియని వ్యక్తి ఇలా మెసేజ్ పెట్టడం ఏంటని ఆమె షాకైంది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. రంగంలోకి దిగిన సదరు భర్త.. ప్రబుద్ధుడికి వివరాలు తెలుసుకుని ఇంటికి వెళ్లి మరీ దేహశుద్ది చేసి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో, బాధితుడు.. ట్విట్టర్ వేదికగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పాడు. దానికి పోలీసులు సమాధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. Not sure what you were expecting on your unwarranted message to a woman, but they should not have beaten you up. They should have reported you to us and we would have served you right under right sections of law. Both these offences will be duly taken care of as per law! https://t.co/qGmXNvubcO — Punjab Police India (@PunjabPoliceInd) July 19, 2022 వివరాల ప్రకారం.. ఓ మహిళ మొబైల్‌కి నువ్వంటే నాకు ఇష్టం (I Like You) అని ఓ వ్యక్తి మెసేజ్ పెట్టాడు. దీంతో ఆమె భర్త వచ్చి.. అతడిని చితకబాదాడు. అనంతరం జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్విట్టర్ వేదికగా "సార్.. నేను ఒకరికి I like u మెసేజ్ పంపాను. ఆమె భర్త వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. నేను చాలాసార్లు క్షమించమని అడిగాను. అయినా సరే అతను కొట్టాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి అనిపిస్తోంది. దయచేసి ఏదైనా చెయ్యండి. నన్ను కాపాడండి. ఆయన మళ్లీ నాపై దాడి చేసే అవకాశం ఉంది’’ అని రాసుకొచ్చాడు. దీనికి పోలీసులు ట్విట్టర్ వేదికగానే బదులిస్తూ.. "మీరు ఓ మహిళకు అలా మెసేజ్ పెట్టి ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. ఆమె భర్త మాకు ఫిర్యాదు చేయకుండా మిమ్మల్ని అలా కొట్టడం కూడా కరెక్ట్ కాదు. మేము మీకు సరైన సెక్షన్ కింద సరైన శిక్ష వేస్తాం. ఈ రెండు అంశాలకూ చట్ట ప్రకారం దర్యాప్తు ఉంటుంది. ఇద్దరి పైనా చట్టప్రకారం చర్యలుంటాయి" అని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు.. మీ సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని స్పష్టం చేశారు. కాగా, ఇలాంటి రియాక్షన్‌కు ఖంగుతిన్న బాధితుడు కామ్‌గా ఉండిపోయాడు. దీంతో, వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. You can visit the nearest PS and lodge the complaint. — Punjab Police India (@PunjabPoliceInd) July 19, 2022 -
మహిళపై టీడీపీ సర్పంచ్ దౌర్జన్యం
కలకడ : ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత చొరబడి నానా దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలకడ మండలం కలకడదొడ్డిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ సోదరుడు, కె.దొడ్డిపల్లె సర్పంచ్ మద్దిపట్ల నాగరాజ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో చరపల్లె. శ్రీనివాసులునాయుడు భార్య అలివేలమ్మను నిద్ర లేపి తనకు ఓటు వేయలేదని నానా దుర్భాషలాడి కత్తితో చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
ఇన్‌స్టా రీల్స్ సోషల్ మీడియలో పెడతానంటూ.. లైంగిక వేధింపులు
సాక్షి, తమిళనాడు: నమ్మి స్నేహం చేసిన యువతిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకోవాలని చూశాడో వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్ గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురైకి చెందిన ఓ యువతికి సంతోష్ కుమార్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండేళ్ల క్రింతం పరిచియం ఏర్పడింది. వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు(రీల్స్) చేయడం మొదలుపెట్టారు. వారిద్దరు కలసి సన్నిహితంగా ఉంటూ చేసిన పలు వీడియోలను సోషల్ మీడియోలో పెడతానని సంతోష్ బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించాడు. అంతటిలో ఆగకుండా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని యువతి తన తల్లిదండ్రులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. యువతి తల్లి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
డాక్టర్‌నంటు యువతులకు గాలం వేసి..
సాక్షి, విశాఖపట్నం: చేసేది డ్రైవర్ ఉద్యోగం.. కానీ డాక్టర్‌నంటు యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని లోబరుచుకునేవాడు. తర్వాత వేధింపుల పర్వానికి తెరతీసి.. వారి నుంచి నగలు, నగదు దోచుకునేవాడు. విశాఖలో వైద్యుడిగా చలామణీ అవుతూ మహిళలను ముగ్గులోకి దింపి వేధింపులకు గురి చేసిన మోసగాడి గుట్టు రట్టయింది. 20 మంది యువతులు ఆ మాయగాడి బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తప్పుడు వివరాలతో ఓ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. వైద్యుడిగా పరిచయం చేసుకుని యువతులను లోబరుచుకునేవాడు. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఈ విధంగా యువతలను బెదిరించి పెద్ద ఎత్తున బంగారు నగలు, భారీగా నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి స్నేహితుల్ని తన లైంగిక వాంఛలు తీర్చేలా చేయాలని బాధితులను ఒత్తిడి చేసేవాడు. మాయగాడి వలలో పడిన బాధితురాలొకరు నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. సుమారు ఆరు నెలలుగా ఈ తతంగమంతా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో నాలుగురోజుల క్రితం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. -
మహిళా ఉద్యోగిపై...
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా పౌరసరఫరా శాఖా కార్యాలయంలో అసిస్టెంట్ పౌరసరఫరాల అధికారిగా పని చేస్తున్న పీతల సురేష్ సహోద్యోగినిని అసభ్యకర పదజాలాలతో మాట్లాడడంతో గురువారం ఆమె బంధువులు పౌరసరఫరాల కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగారు. పౌరసరఫరాశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ వివరాలు కావాలని ఏఎస్ఓ సురేష్ పలుమార్లు సీనియర్ అసిస్టెంట్ ప్రసన్నజ్యోతిని అడిగారు. అయితే ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో బుధవారం ఆమెను అనేక సార్లు పిలిచినా ఆమె స్పందించలేదు. దీంతో సురేష్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర పదజాలాలతో మాట్లాడినట్టు ఆమె తన బంధువులకు తెలిపింది. గురువారం ఆమె బంధువులు, ఐద్వా మహిళానాయకురాళ్లు సివిల్సప్లైకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అసభ్యకరపదజాలాలతో మహిళలను వేధిస్తున్న సురేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి పి.ప్రసాదరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉద్యోగిని పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సురేష్‌తో ఆమెకు క్షమాపణ చెప్పించడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఒకనొక దశలో ప్రసన్నజ్యోతి బంధువులు సురేష్‌పై దాడికి ప్రయత్నించడంతో పలువురు అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖా కార్యాలయంలో జరిగిన ఆందోళన, తదితర విషయాలను డీఎస్ఓ ప్రసాదరావు జేసీ లక్ష్మీశ దృష్టికి తీసుకెళ్లారు. -
మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..
వనపర్తి: చిన్నపిల్లలు, మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తే.. గ్రామంలో ఉండే అర్హత కోల్పోతారని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ పద్మమ్మ తీర్మానం చేశారు. ఇటీవల తరుచూ.. మహిళలు, చిన్నపిల్లలపై చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తాడిపర్తిలో మహిళలకు అందించాల్సిన పౌష్టికాహారం, సామర్థ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలతో పాటు సర్పంచ్ పద్మమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి ప్రస్తావన వచ్చింది. గ్రామస్తులంతా ఒక్కతాటిపై ఉండి మన గ్రామంలో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఆలోచించారు. వెంటనే ఉపసర్పంచ్ రామకృష్ణ, ఇతర వార్డుల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులను పిలిపించారు. చిన్న పిల్లలు, మహిళలపైగాని అత్యాచారానికి పాల్పడినా.. ప్రయత్నించినా.. అట్టి వారికి గ్రామంలో నివసించే స్థానం ఉండదని తీర్మానం చేశారు. ఈ రోజు నుంచే గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు, పక్కాగా అమలుచేస్తామని సర్పంచ్ ప్రకటించారు. మహిళలు, పెద్దలు, ఇతర గ్రామస్తులు పంచాయతీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. గ్రామంలో ఉన్న ఐక్యతను చూసిన ఆర్డీఎస్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ప్రతిని«ధి శ్రీవాణి, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఓ, ఎఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. -
అసాంజేకు 50 వారాల జైలు
లండన్: వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే(47)కు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికిగాను ఆయనకు 50 వారాల జైలు శిక్ష పడింది. స్వీడన్ మహిళ లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కోర్టు నుంచి బెయిల్ పొందిన అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అసాంజేకు ఇచ్చిన దౌత్యపరమైన వెసులుబాటును ఈక్వెడార్ ప్రభుత్వం ఉపసంహరించుకోడంతో గత నెలలో బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై బుధవారం సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జడ్జి డెబొరా టేలర్ అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
కోరిక తీర్చలేదని.. కక్షగట్టారు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆమెకు తల్లిదండ్రుల్లేరు.. పేదరికం కారణంగా వివాహమూ కాలేదు.. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. నాలుగు మెతుకులు పెడుతున్న ఆ చిన్న ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. ఆమె చేసిన తప్పల్లా.. పై అధికారి కోరిక తీర్చకపోవడమే. దీంతో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆ అభాగ్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఉద్యోగమే ఆధారం: విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె జీవితం లేదు. కోరిక తీర్చు.. లేదా డబ్బులు కట్టు! ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను తనపై పడుతుందని ఆమె ఊహించలేదు. అతని బుద్ధి తెలిసి కుంగిపోయారు. డబ్బుకి పేదనైనా.. గుణానికి కాదంటూ అతని కోరికను తిరస్కరించారు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విచారించాకే చర్యలు ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరు కావడం లేదు. దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశాం. ఆమె స్థానంలో జన్మభూమి కమిటీ సూచించిన వ్యక్తిని నియమించాం. – శ్రీహరి, ఐదు మండలాల క్లస్టర్ ఏపీడీ. ఆమె మాటలు అవాస్తవం ఫీల్డ్ అసిస్టెంట్ వాణిశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. విధి నిర్వహణలో ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ఆమె స్థానంలో ఎవరో ఒకరిచే పనిచేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నాం. – పి.కామేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీవో, జామి మండలం. -
ఏం... మగాళ్లం కాదా...
మా అమ్మ ముందే వెళ్లిపోయింది. వెళ్లిపోవాల్సి వచ్చింది అని అనాలి. కాని అన్నిసార్లూ ధైర్యం చేయలేము కదా. వాళ్లమ్మ మాత్రం మొన్నటి దాకా ఉంది. ‘ఎవరికి పట్టకపోయినా మా అమ్మకు పట్టక తప్పదు కదండీ. ఒక్కగానొక్క కూతుర్ని. మీరో తిక్కమేళం. తనుండీ అన్నీ చూసుకోకపోతే ఎలాగా’ అంది జుబ్బా గుండీ గోముగా తెంపేస్తూ. ఫ్యాబ్ ఇండియాలో మూడు జుబ్బాలు కొన్నాను ఆఫీస్‌లో లోన్ పెట్టి. పెళ్లి రోజుకని ఒకటి, ఆ రోజుకని ఒకటి, పదహారు రోజుల పండగకు ఒకటి. ఆల్రెడీ రెండింటి గుండీలు తెంపేసింది- గోముగా. ఇవాళ మూడోదీ తెంపింది- గోముగా. ఈ గోమును ఎవడు సృష్టించాడో. కొత్త కాపురం సెట్టయ్యాక అత్తగారు మాటలతో హితవు, కళ్లతో బెదిరింపూ, బాడీ లాంగ్వేజ్‌తో మా అమ్మాయిని ఏమైనా చేశావో అండమాన్ పంపిస్తా అనే సంస్కారవంతమైన వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాక తెల్లారింది. వడ, గారె, పులిహోర, గరిటెతో గుంట నొక్కగా అందులో సువాసనలీనే నెయ్యితో పొగలు గక్కే పొంగలి... వీటిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా గోముగా ఒక గావుకేక వినిపించింది... ‘హేమండీ... కాస్త బజారుకు వెళ్లి టిఫిన్ పట్రండీ’... ‘ఏం... ఏదైనా చేయకపోయావా?’ ‘ఎక్కడండీ... సరుకులు సర్దుకోలేదు... సర్దులు సరుకుకోలేదు.... లేదులు సర్దుల్ని చేసి కొసరుకోలేదు’... ఇలా ఏదేదో చెప్పింది. అసలు మగాడు పెళ్లి చేసుకునేదే టిఫిను కోసమని నా ఉద్దేశం. టిఫిన్ సెంటర్ల వాళ్లకు ఆ మేరకు భారత మానవ వనరులశాఖ రుణపడి ఉండాలి. వాళ్లే గనక ఏ టిఫిన్నైనా ఒకేలా చేయడం మానేసినా, ఒకేలాంటి టిఫిన్‌ని అనేక పదార్థాలుగా నమ్మించడం వదిలేసినా ఎవడూ పెళ్లి చేసుకోడు. పిల్లల్ని కనడు. ఇక జనాభాని జైజవాన్ జైకిసాన్ జైపరేషాన్గా మార్చేదెక్కడ? పంచ్ డైలాగుల కంటే పరమ నాసిరకమైన ఆ టిఫిన్‌ని కడుపు నిండా తినలేక, సగం కడుపుతో ఆఫీసుకు వెళ్లి, ఆ చిరాకులో బాస్‌ను ఏదో మాట అని, బాస్ అది కడుపులో పెట్టుకుని మంచి వేసంగిలో చీపురుపల్లికి ట్రాన్స్ఫర్ చేసి... అవసరమా అని పెళ్లి చేసుకుంటారు. తీరా జరిగేది ఇది. ఏదో దర్శినిలో ఆ పూటకు ‘వడ’ అనే రెండు బ్రౌన్ మార్బెల్స్ని, ‘పూరీ’ అనే రెండు టిన్నుల రిపీటెడ్లీ యూజ్డ్ నూనెనీ దర్శించాను. ఇది ఇవాళ్టికే అని భ్రమపడ్డాను. కృష్ణలీల. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు. మొన్నే ‘బెస్ట్ సందర్శన్ అవార్డ్’ ఇచ్చి రెండు ప్లేట్ల మైసూరు బోండా కూడా కట్టిచ్చారు. ఈసురో- అన్నాను. ఓయ్- అని నాబోటి వందమంది బదులు పలికారు. బట్టలు మడత పెట్టడం ఒక కళ. పెట్టించడం ఉత్కళ. ‘కాస్త ఆ బట్టలు మడత పెట్టండి’... ‘నేనా?’ ‘మీరైతే చాలా చక్కగా... అంచులు కలిసేలా... మనసులు మురిసేలా... మమతలు విరిసేలా’... అప్పట్నించి మా ఇంట్లో ఎన్ని బట్టలున్నాయో నాకు కంఠోపాఠం. మరోరోజు బాల్కనీలో పిలిచింది. బంతిపూలు పూసి కనిపించాయి. ‘ఇవి మీరు నాటిన మొక్కలేగా’ ‘అవును’... ‘అందుకే మిమ్మల్ని చూసి నువ్వుతున్నాయి. భలే భలే... మీ చేయి చాలా మంచిది’ పొగుడుతూ సంబరంగా చప్పట్లు కొట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటికి నేనే నీళ్లు పోస్తున్నాను. ఎలక్ట్రీషియన్ రోషానికి పోయాడు. షాక్ కొడుతోందని నిరూపిస్తే వృత్తి మానేసి ఉంగటూరు వెళ్లిపోతానని సవాలు విసిరాడు. మా వెర్రిదేమో... అమ్మో నాకు భయంగా ఉందండీ... అని గోముగా నా గుండీలు లాగడానికి చూసింది. ఉంటేగా? చాలా ఏళ్లుగా పిన్నీసులు పెట్టుకుని తిరుగుతున్నాను. ‘ఇప్పుడేమిటి చేయడం?’ అడిగాను. ‘మీరే చెప్పాలి’ ఏం చెప్తాను? వాషింగ్ మిషన్‌లో రెండు చెమ్చాలు ఏరియల్ వేసి తెల్లటి తెలుపు కోసం అశ్రువొక్కటి ధారబోశాను. మా అమ్మ నన్ను మగవాడిగానే పెంచలేదు. నా హితం కోరే మనిషైతే చిన్నప్పుడు నేను వంటగదిలోకి ఎప్పుడు వెళ్లినా కసురుకునేదా? ఛీ... అనీ ఛా.. అనీ... నువ్వేమైనా ఆడపిల్లవా అస్తమానం వంట గదిలో దూరడానికి... అనీ తరిమేసేదా? ఆమె గనక రానిచ్చి ఉంటే ఒక అన్నం నాలుగు కూరలు ఏవో రెండు తాలింపులు కాస్త చారు పెట్టడం నేర్పించి ఉంటే ఎంత బాగుండేది. ఎంత మగాడి బతుకు దక్కి ఉండేది. ‘ఇవాళ తలనొప్పిగా ఉందండి- సుకన్యా నుంచి సాంబారు తెచ్చుకోరాదూ’... ‘ఇవాళ నొప్పితల- ఐశ్వర్యా నుంచి ఏమైనా’... ‘ఇవాళ బొప్పి- భానుప్రియకు వెళ్లి’.... సుకన్యా, ఐశ్వర్యా, భానుప్రియ... హు... పాండీబజారులో ఏ లాటరీలు కొట్టయినా వీళ్లనే చేసుకునుంటే పోయుండేది. ఈ ఇలవేల్పు అవసరం ఏముండేది? మా ఆవిడ బంగారం. నా తోడిదే లోకం. బాగా చూసుకుంటుంది. పిల్లల్ని ప్రాణం పెట్టి సాక్కుంటుంది. ఉద్యోగం చేసి- మంచి జీతమే కనుక- వేణ్ణీళ్లకు వేణ్ణీళ్లే తోడు చేస్తుంది. శబాసే. మరి ఈ షిఫ్ట్ సిస్టమ్ మాటేమిటి? ఎంతో గోముగా నా నెత్తి మీద ఇంటి పనులన్నీ పడేయడం ఏమిటి? మేం ఇలా ఉంటే లేజీ హజ్బెండ్స్ అని క్యాబేజీలా తరిగేస్తారు. లేజీ వైవ్స్ ఉంటారని ఏ చానెల్ వాళ్లు బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు? అంటే? ఉద్యోగం చేసి మళ్లీ ఇంటి పని కూడా చేయాలా? ఏం... మేం చేయట్లేదా? మాకు సమాన హక్కులు లేవా? మేం మనుషులం కామా? మేం మగవాళ్లం కామా? కాని ఈ గోడు వినేదెవరు? ‘ఇదిగో... మిమ్మల్నే’... ‘వచ్చే వచ్చే... ఏంటి కరివేపాకు తేవాలా?’ - భా.బా (భార్యా బాధితుడు) గమనిక: చాలా మంది భా.బాలు మా అనుభవాలు రాస్తాం మా అనుభవాలు చెప్తాం అని వెంటపడుతున్నారు. కొందరైతే తమకో వాహిక దొరికిందని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. నా ఏడుపయ్యాక మీ సంగతికి వద్దాం..!