తిరుపతి, సాక్షి: తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకమార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి ఒంటి గంట నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటలకు గేట్లు తెరవడంతో క్యూ లైన్లు కిక్కిరిసిసోయాయి.
టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చి కార్లు, బస్సుల్లో తిరుమలకు భక్తులకు పోటెత్తారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరక్కపోవడంతో కాలినడక భక్తులు బయల్దేరారు. ఇక ఇదే అదనుగా భక్తుల నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలు దొపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల లైన్లలో భక్తులు నిల్చున్నారు. ఉచిత సర్వదర్శనానికి 18 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం 79,584 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,848 కాగా, శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు లెక్క తేలింది.
Comments
Please login to add a commentAdd a comment