devotess rush
-
తిరుమలకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకమార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి ఒంటి గంట నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటలకు గేట్లు తెరవడంతో క్యూ లైన్లు కిక్కిరిసిసోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చి కార్లు, బస్సుల్లో తిరుమలకు భక్తులకు పోటెత్తారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరక్కపోవడంతో కాలినడక భక్తులు బయల్దేరారు. ఇక ఇదే అదనుగా భక్తుల నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలు దొపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల లైన్లలో భక్తులు నిల్చున్నారు. ఉచిత సర్వదర్శనానికి 18 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం 79,584 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,848 కాగా, శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు లెక్క తేలింది. -
స్వర్ణ రథంపై సప్తగిరీశుడు..!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఆదివారం స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య సాగింది. ఈ స్వర్ణ రథం 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ తరహాలో రథం మన దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ రథాన్ని 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన 2,900 కిలోల రాగి పై 9 సార్లు తాపడం చేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారికీ టీటీడీ రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 2013లో తొలిసారిగా ఊరేగించారు. ఉదయం భక్తశిఖామణిపై శ్రీరామచంద్రుడు రాత్రి గజరాజుపై రారాజు దర్శనం ఇవ్వగా ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా మాడ వీధులలో భక్తులను కనువిందు చేశారు. వాహన సేవల్లో పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ భక్తుల సహకారంతో విజయవంతమైందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సర్వ దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి లైన్ ఆల్వార్ ట్యాంక్ వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.2.94 కోట్లు వేశారు. టీటీడీలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన అనంతరం స్వామి వారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం. -
మేడారం జాతర సంపూర్ణం
-
మేడారంలో పోటెత్తిన భక్తులు
సాక్షి, భూపాలపల్లి: చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్ ఎస్కె జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
భవానీలతో ఇంద్రకీలాద్రి కిటకిట
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీలతో కిటకిటలాడుతోంది. దీక్ష విరమణ చేయటానికి భారీ సంఖ్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం 68వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజైన సోమవారం తెల్లవారుజాము నుంచే భవానీల తాకిడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భవానీలతో కృష్ణాతీరం ఎరుపెక్కింది. ఘాట్లలో పుణ్యస్నానాల అనంతరం భవానీలు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అనంతరం దీక్ష విరమణ చేసి హోమగుండాల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీక్ష విరమణ చేసే మహామండపంలో ఎక్కువ మంది సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందిగా మారిందని భవానీలు వాపోతున్నారు. -
సర్వదర్శనానికి ఆధార్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు. టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు టీటీడీ అధికారులు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి నూతన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. టోకెన్లు లేకుండా కంపార్టుమెంట్లులో వేచి ఉన్న భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఇప్పటికే నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం, నడకదారి భక్తులు కలిపి 38 వేల మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ స్లాట్ విధానం అమలులోకి వస్తే భక్తులందరికీ శ్రీవారి దర్శనం సులభతరంగా లభిస్తుందని టీటీడీ అధికారులు అంటున్నారు. -
తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ మేర బయటివరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం)స్వామివారిని 1,01,386 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లు సోమవారం సాయంత్రం మయూర వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. సోమవారం శివుడికి ప్రీతిపాత్రం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
700 పైగా సామూహిక అభిషేకాలు - 55పైగా గర్భాలయ రుద్రాభిషేకాలు - ఆలయ పూజావేళల్లో మార్పు - పాతాళగంగలో పుణ్యస్నానాలు–కార్తీక దీపారాధనలు శ్రీశైలం: కార్తీకమాసం.. శివునికి అత్యంత ప్రీతికరమైన నాలుగవ సోమవారం జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం భక్తజన సంద్రంగా మారింది. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఈఓ నారాయణభరత్ గుప్త వేకువజామున 2గంటలకు మంగళవాయిద్యాలు, 2.30 గంటలకు సుప్రభాతం, 3గంటలకు మహామంగళహారతి, 3.30గంటల నుంచి దర్శన ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు వేకువజామున 2గంటల నుంచే పాతాళగంగ మెట్ల మార్గంలో నదీ తీరం చేరుకుని పవిత్ర కార్తీక స్నానాలను నిర్వహించుకున్నారు. 3.30గంటల నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో ఉచిత ప్రత్యేక దర్శన క్యూలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. అలాగే అభిషేక ప్రియుడైన శ్రీ మల్లికార్జున స్వామివార్లకు సామూహిక అభిషేకాలను నిర్వహించుకోవడానికి భక్తులు వందల సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేశారు. ఆన్లైన్, ఒకరోజు ముందస్తు టికెట్లు, కరెంట్ బుకింగ్ ద్వారా సుమారు 750 పైగా అభిషేకం టికెట్లను విక్రయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే శాస్త్రోక్త మంత్రపూరిత రుద్రాభిషేకానికి సైతం భక్తులు రూ.5వేల టికెట్ ఖర్చుకు వెనుకాడకుండా 55 పైగా అభిషేకాలను నిర్వహించుకున్నారు. కార్తీక దీపారాధనలు– వ్రతనోములు కార్తీకమాసం నాలుగవ సోమవారం సందర్భంగా ప్రధాన మాడా వీధుల్లోని రథశాల వద్దనున్న గంగాధర మండపం చుట్టూ వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలాచరించుకుని కార్తీక దీపారాధనలు, వ్రతనోములను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, ఉసిరిచెట్ల సముదాయం వద్ద మల్లన్న దర్శనానంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ఉపవాస దీక్షలను విరమించారు. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల్లో భక్తుల రద్దీ స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం భక్తులు అమ్మవారి ఆలయం వెనుకనున్న లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోర ప్రసాదాల కోసం బారులు తీరారు. గతంలో అమ్మవారి ఆలయం వెనుక రెండు ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఉండేవి. అయితే ఇటీవల ఎస్బీహెచ్ నిర్వహించే ఒక ప్రసాద విక్రయ కేంద్రాన్ని ల్యాండ్ స్కేపింగ్ కోసం కూల్చి వేయడంతో ఉన్న ఒక్క ప్రసాద విక్రయ కేంద్రం వద్ద భక్తుల తాకిడి పెరిగి క్యూలన్నీ పోటెత్తాయి. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు.