తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణ మండపంలో వాహనసేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 'బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన 16వ తేదీ ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 8 వరకు పెద్దశేష వాహనసేవ, 20వ తేదీ రాత్రి 7 నుంచి గరుడసేవ జరగనుంది. 21వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు కల్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. 23వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనసేవ ఉంటుంది. 24వ తేదీ ఉదయం 6 నుంచి 9 వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. విజయదశమి రోజైన 25వ తేదీన పార్వేట ఉత్సవాన్ని ఏకాంతంగా జరుపుతారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. పార్వేట ఉత్సవం అనంతరం స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు' అని టీటీడీ వెల్లడించింది. (ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు)
వాహన సేవ వివరాలు
16-10-2020: బంగారు తిరుచ్చి ఉత్సవం(ఉదయం 9 గంటలకు)
పెద్దశేష వాహనం(రాత్రి 7 గంటలకు)
17-10-2020: చిన్నశేష వాహనం (ఉదయం 8 గంటలకు)
హంస వాహనం(రాత్రి 7 గంటలకు)
18-10-2020: సింహ వాహనం(ఉదయం 8 గంటలకు)
ముత్యపుపందిరి వాహనం (రాత్రి 7 గంటలకు)
19-10-2020: కల్పవక్ష వాహనం (ఉదయం 8 గంటలకు)
సర్వభూపాల వాహనం(రాత్రి 7 గంటలకు)
20-10-2020: మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు)
గరుడసేవ(రాత్రి 7 గంటలకు)
21.10.2020: హనుమంత వాహనం (ఉదయం 8 గంటలకు)
పుష్పకవిమానం(మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు)
గజ వాహనం(రాత్రి 7 గంటలకు)
22-10-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం 8 గంటలకు)
చంద్రప్రభ వాహనం(రాత్రి 7 గంటలకు)
23-10-2020: సర్వ భూపాల వాహనం(ఉదయం 8 గంటలకు)
అశ్వ వాహనం(రాత్రి 7 గంటలకు)
24-10-2020: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం(తెల్లవారుజామున 3 నుంచి 5 వరకు)
స్నపనతిరుమంజనం, చక్రస్నానం (ఉదయం 6 నుంచి 9 వరకు)
బంగారు తిరుచ్చి ఉత్సవం(రాత్రి 7 గంటలకు)
Comments
Please login to add a commentAdd a comment