navaratri brahostavalu
-
Devotees Rush: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమల: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం (ఫొటోలు)
-
మలయప్ప స్వామిగా శ్రీవారు
సాక్షి, తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ చంద్రప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో స్వామి వారి వాహన సేవలను ఆలయంలో ఏకంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ మలయప్ప స్వామి వారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఉదయం 8.00 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు..కరోనా విజృభిస్తున్న నేపధ్యంలో రేపు ఉదయం స్వర్ణరధంను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. (వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు ) -
వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వేడుకున్నాను. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. (చదవండి: శ్రీవారికి కానుకగా బంగారు శఠారి) వకుళ మాత ఆలయ నిర్మాణం చాలా సంతోషం: గజల్ శ్రీనివాస్ భారత్ సేవ్ టెంపుల్స్లో భాగంగా మా చిరకాల కోరిక వకుళ మాత ఆలయం నిర్మాణం జరడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గజల్ శ్రీనివాస్. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాతృత్వంతో వకుళ మాత ఆలయం రూపకల్పన జరగడం చాలా ఆనందం. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్చ తిరుమలను అందంగా తీర్చి దిద్దిన టీటీడీని అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి’ అని కోరారు. (చదవండి: ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వచ్చారు) విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: కోన రఘుపతి కరోనా, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాలని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని తెలిపారు. -
కన్నులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
సాక్షి, తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా వాహన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించారు. గజం అంటే అహాంకారానికి ప్రతీక. ప్రతిమనిషి గజరాజును అదర్శంగా తీసుకొని తమలోని అహాంకారాలను వీడనాడి స్వామిశరణు కొరాలన్నదే గజవాహన సేవలోని అంతర్యం. గజేంద్రమోక్షంలో తనను శరణు కోరిన గజేంద్రుడిని మొసలి బారి నుంచి కాపాడిన్నట్లే, తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అన్నివేళల తానే కాపాడుతానని శ్రీనివాసుడు గజంను అధిరోహిస్తారు. రాజుల కాలం నుంచి చతురంగ బలంలో గజం బలం ఒకటి. కర్మబంధం నుంచి విముక్తి పొందేందుకు గోవిందుడే దిక్కన్నట్లు సాగుతుంది గజవాహన సేవ. -
ఈనెల 16 నుంచి శ్రీవారి వాహనసేవ
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణ మండపంలో వాహనసేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 'బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన 16వ తేదీ ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 8 వరకు పెద్దశేష వాహనసేవ, 20వ తేదీ రాత్రి 7 నుంచి గరుడసేవ జరగనుంది. 21వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు కల్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. 23వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనసేవ ఉంటుంది. 24వ తేదీ ఉదయం 6 నుంచి 9 వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. విజయదశమి రోజైన 25వ తేదీన పార్వేట ఉత్సవాన్ని ఏకాంతంగా జరుపుతారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. పార్వేట ఉత్సవం అనంతరం స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు' అని టీటీడీ వెల్లడించింది. (ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు) వాహన సేవ వివరాలు 16-10-2020: బంగారు తిరుచ్చి ఉత్సవం(ఉదయం 9 గంటలకు) పెద్దశేష వాహనం(రాత్రి 7 గంటలకు) 17-10-2020: చిన్నశేష వాహనం (ఉదయం 8 గంటలకు) హంస వాహనం(రాత్రి 7 గంటలకు) 18-10-2020: సింహ వాహనం(ఉదయం 8 గంటలకు) ముత్యపుపందిరి వాహనం (రాత్రి 7 గంటలకు) 19-10-2020: కల్పవక్ష వాహనం (ఉదయం 8 గంటలకు) సర్వభూపాల వాహనం(రాత్రి 7 గంటలకు) 20-10-2020: మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు) గరుడసేవ(రాత్రి 7 గంటలకు) 21.10.2020: హనుమంత వాహనం (ఉదయం 8 గంటలకు) పుష్పకవిమానం(మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు) గజ వాహనం(రాత్రి 7 గంటలకు) 22-10-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం 8 గంటలకు) చంద్రప్రభ వాహనం(రాత్రి 7 గంటలకు) 23-10-2020: సర్వ భూపాల వాహనం(ఉదయం 8 గంటలకు) అశ్వ వాహనం(రాత్రి 7 గంటలకు) 24-10-2020: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం(తెల్లవారుజామున 3 నుంచి 5 వరకు) స్నపనతిరుమంజనం, చక్రస్నానం (ఉదయం 6 నుంచి 9 వరకు) బంగారు తిరుచ్చి ఉత్సవం(రాత్రి 7 గంటలకు) -
గంటలో శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఏడు కొండల వాడి దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 64,185 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా తిరుమల బ్రహ్మోత్సవ శోభతో కళకళలాడుతోంది. విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మంగళవారం అంకురార్పణ సందర్భంగా విష్వక్సేనుడి ఊరేగింపుతో పాటు పుష్పాలంకరణతో బలిపీఠం, ఆలయ ప్రాంగణం కాంతులీనాయి.