తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఏడు కొండల వాడి దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఏడు కొండల వాడి దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 64,185 మంది భక్తులు దర్శించుకున్నారు.
కాగా తిరుమల బ్రహ్మోత్సవ శోభతో కళకళలాడుతోంది. విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మంగళవారం అంకురార్పణ సందర్భంగా విష్వక్సేనుడి ఊరేగింపుతో పాటు పుష్పాలంకరణతో బలిపీఠం, ఆలయ ప్రాంగణం కాంతులీనాయి.