
సాక్షి, విజయవాడ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు (బుధవారం) విజయవాడలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నై నుంచి హైదరాబాద్.. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల, నెక్కలం, గూడవల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలిసి మాట్లాడనున్నారు. అనంతరం నేరుగా విడిది గృహానికి చేరుకొని 3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. నాలుగు గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాలులో ‘‘వ్యవసాయ బిల్లులపై రైతులు, వ్యవసాయరంగ నిపుణులుతో నిర్వహించే చర్చా కార్యక్రమం"లో సీతారామన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ నేతలు హాజరవుతారు.
Comments
Please login to add a commentAdd a comment