Vijayawada: Kutumbarao Installs Statue Of His Late Wife - Sakshi
Sakshi News home page

అబ్బురపరుస్తున్న సజీవ శిల్పం!

Published Sun, Nov 14 2021 11:53 AM | Last Updated on Sun, Nov 14 2021 4:31 PM

Vijayawada Man Installs Statue Of His Late Wife At Krishna District - Sakshi

సాక్షి, మధురానగర్‌( విజయవాడ సెంట్రల్‌): విగ్రహం అని ఏ మాత్రం అనుమానం అనిపించకుండా.. అచ్చు మనిషిలానే ఉన్న ఈ సజీవ శిల్పం అబ్బురపరుస్తోంది. విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు ఏడాది కిందట చనిపోయిన తన భార్య కాశీఅన్నపూర్ణ జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని తయారు చేయించుకుని ఇంట్లో ప్రతిష్టించుకున్నారు.

చదవండి: ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!

ఆమె జయంతి 14వ తేదీ(ఆదివారం) కావడంతో విజయవాడకు చెందిన శిల్పి శివవరప్రసాద్‌ ‘సిలికాన్‌ వ్యాక్స్‌’ మెటీరియల్‌తో దీనిని తయారు చేసి ఇచ్చారు. జీవ కళ ఉట్టిపడుతున్న ఈ విగ్రహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement