సాక్షి, విజయనగరం: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో విజయనగరం జిల్లా ఆదివారం రికార్డ్ సాధించింది. జిల్లాలోని 248 గ్రామ, వార్డు సచివాలయాల్లో వంద శాతంకు మించి వ్యాక్సిన్‌ను జిల్లా ప్రజలకు అందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించినట్లు విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం టెస్టుల సంఖ్యల పెంచుతూ.. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,531కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment