విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఈనాడుకు వ్యతిరేకంగా మానవహారంగా ఏర్పడి నినదిస్తున్న గ్రామ వలంటీర్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/కోటబొమ్మాళి/మదనపల్లె: ఈనాడు దినపత్రికలో ప్రచురించినట్లుగా తాము వేగులం కాదని, ప్రజలకు సేవలందిస్తున్న సేవకులమని గ్రామ, వార్డు వలంటీర్లు స్పష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో అపోహలు పెంచేలా అవాస్తవ కథనాలు రాయడం దారుణం అని మండిపడ్డారు. బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి, లక్కవరపుకోట, రాజాం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిరసనలు, మానవ హారాలు నిర్వహించారు.
భారీ సంఖ్యలో వలంటీర్లు తరలి వచ్చి నిరసన తెలిపారు. వేగులమంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఈనాడు దారుణంగా దుష్ప్రచారం చేయడం తగదని ధ్వజమెత్తారు. రామోజీరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కథనాలకు నిరసనగా రామోజీ దిష్టిబొమ్మను, ఈనాడు ప్రతులను దహనం చేశారు.
మదనపల్లెలో వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదయ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీరుగట్టి రాజేష్ మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతో వలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా రాస్తే ప్రజలు నిజమని నమ్మేస్తారనుకోవడం రామోజీ భ్రమ అన్నారు.
వలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడం వల్లే నేడు నూరు శాతం ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరుతున్నాయని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలు, యూనిసెఫ్ ఈ వ్యవస్థపై ప్రశంసలు వ్యక్తం చేయడం కనిపించలేదా.. అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment