బురదచల్లడం మానుకోండి: రామోజీపై వలంటీర్ల ఆగ్రహం | Volunteers fires On Eenadu Ramoji Rao | Sakshi
Sakshi News home page

బురదచల్లడం మానుకోండి: రామోజీపై వలంటీర్ల ఆగ్రహం

Published Sat, Dec 17 2022 5:58 AM | Last Updated on Sat, Dec 17 2022 7:41 AM

Volunteers fires On Eenadu Ramoji Rao - Sakshi

గుర్రంకొండలో నిరసన తెలుపుతున్న వలంటీర్లు

శంఖవరం/గుర్రంకొండ: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ నిస్వార్థంగా సేవలంది­స్తు­న్న తమపై బురదచల్లడం మానుకోవాలని ఈనాడు పత్రిక, రామోజీరావుపై పలువురు వలంటీర్లు ఆగ్ర­హం వ్యక్తంచేశారు. వలంటీర్‌లపై ‘ఈనాడు’లో వచ్చిన అసత్య కథనాన్ని ఖండిస్తూ శుక్రవారం కాకినాడ జిల్లా శంఖవరం, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈనాడు దినపత్రిక ప్రతులు, రామో­జీరావు దిష్టిబొమ్మలను వలంటీర్లు దహనం చేశారు. వలంటీర్లు మాట్లాడుతూ ‘ఈనాడులో ప్రచు­రించినట్లుగా మేం వేగులం కాదు... ప్రజాసేవ­కు­లం. అవినీతికి తావులేకుండా అద్భుతంగా పనిచే­స్తున్న వలంటీర్‌ వ్యవస్థపై ప్రజల్లో అపోహలు సృష్టించడానికి రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేయ­డం దారుణం. ఇప్పటికైనా వాస్తవాలను ప్రచురించాలి’ అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement