సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత ఉండటంతో ఎన్నికల విషమమై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ర్టంలో కరోనా కేసులు లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం అప్పుడు ఎన్నికలు జరగాలని వైఎస్సార్‌సీపీ కోరింది. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన దశలో ఎలా నమ్ముతామంటూ ప్రశ్నించారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై ఎవరు మాట్లాడరెందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. (రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదు: నీలం సాహ్ని )
Comments
Please login to add a commentAdd a comment