bostha sathyanarayana
-
ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమే: బొత్స
సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత ఉండటంతో ఎన్నికల విషమమై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ర్టంలో కరోనా కేసులు లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం అప్పుడు ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరింది. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన దశలో ఎలా నమ్ముతామంటూ ప్రశ్నించారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై ఎవరు మాట్లాడరెందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. (రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదు: నీలం సాహ్ని ) -
ఆధునాతన పారిశుధ్య యంత్రాల ప్రారంభం
సాక్షి, విజయవాడ : అధునాతన పారిశుధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎంసీ తరుపున కొత్త టెక్నాలజీతో ఏడు కొత్త వాహనాలను కొనుగోలు చేశామని ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయోచ్చని పేర్కొన్నారు. జెసిబీలో మూడు మినీ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతమవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. (మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత) -
‘దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్ కీలక పాత్ర’
సాక్షి, అమరావతి : వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధర్మాన మండిపడ్డారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. తండ్రి అడుగుజాడల్లో వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఎప్పటికీ పదిలం: మంత్రి బొత్స రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన గొప్ప నాయకుడు రాజశేఖరరెడ్డి.. అందుకే ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. 'ఆంధ్రప్రదేశ్ పరిపాలన చరిత్రలో రాజశేఖర రెడ్డి ఒక మైలు రాయి. ఎల్లప్పుడూ పేదలకు ఎలా సహాయం చేయాలని ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం' అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. -
చైర్మన్ నిర్ణయం అనైతికం కాదా..?
-
మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించిపంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బుధవారం మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నిబంధనలు పాటించకుండా చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారన్నారు. మండలిలో అధికార పార్టీ ఎమ్మెల్సీలతో పాటు, బీజేపీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు అందరూ సెలెక్ట్ కమిటీని వ్యతిరేకించినా ఒక టీడీపీ కార్యకర్తలాగా చైర్మన్ వ్యవహరించి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే బిల్లులను అడ్డుకునే అధికారం మండలికి లేదని, కేవలం ఆ బిల్లులపై అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు మాత్రమే చెప్పేహక్కు ఉందన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు అర్హతలేని వారందరినీ దొడ్డిదారిన రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తమను ఉద్దేశించి మాట్లాడుతూ తాగి వచ్చారని అన్నారని, యనమల వ్యాఖ్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళితే నారా లోకేష్ తనపైకి దురుసుగా వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చోని సెల్ఫోన్లో సూచనలు ఇస్తూ చైర్మన్‌ను ప్రభావితం చేశారని చెప్పారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మండలి పరిణామాలను ఎల్లోమీడియా వక్రీకరించి కథనాలు రాసిందని, తప్పు చేశానని చైర్మనే చెప్పినా కూడా ఆ పత్రికలు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ఆ రెండు పత్రికలు రాష్ట్రాన్ని శాసిస్తాయా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అప్రజాస్వామ్యిక విధానాలు అమలు చేస్తుంటే ఎలా సమరి్థంచాలని, దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా చర్చించాలని అన్నారు. తాము ప్రజాబలంతో రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. -
అమరావతి వాసులు ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రెండు ప్రాంతాల వారితో రెండు రకాలుగా మాట్లాడిస్తూ ఊసరవెల్లిలా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వలలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల్లో భూములిచ్చిన రైతులు కూడా ఉన్నారని, అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని బొత్స చెప్పారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు అప్పులు తెచ్చి డాబుల కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా వృథా చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు’ అని బొత్స అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ ఆకాంక్ష ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మూడు చోట్ల రాజధానుల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందనేది కేబినెట్ నిర్ణయం తర్వాత పరిశీలిస్తాం. మంత్రివర్గ సమావేశంలో చర్చించి రైతులకు ఇచ్చిన హామీల అమలుతోపాటు అన్ని విషయాలు ప్రకటిస్తాం. రూ.1.09 లక్షల కోట్లతో రాజధాని పనులు చేస్తామని అంచనాలు ప్రకటించి రాష్ట్రం అప్పులను రూ.50 వేల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్లకు చంద్రబాబు పెంచేశారు. విశాఖ తరహాలో ఇక్కడ (అమరావతి) కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబులా మేం గ్రాఫిక్స్‌తో మోసం చేయం’ అని బొత్స స్పష్టం చేశారు. -
జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. నివేదికకు యథాతథంగా ఆమోదించాలా? ఇంకా ఏమైనా మార్పులు చేయాలా? అన్నది చర్చిస్తామన్నారు. కమిటీలో నిపుణులు సభ్యులుగా ఉన్నారని, అన్ని అంశాలను పరిశీలించాకే నివేదిక సమర్పించారని చెప్పారు. మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా? రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించే ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేదని బొత్స పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టి నారాయణ కమిటీతో ముందుకు వెళ్లిందని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయని బొత్స పేర్కొన్నారు. ‘మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును నిలదీశారు. రాజధాని ప్రకటనకు ముందే హెరిటేజ్ సంస్థ అమరావతి ప్రాంతంలో భూములు కొనడం ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కాదా? అని ప్రశ్నించారు. -
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక ఇచా్చక రాజధానిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వరకు ఉన్న పరిస్థితిని మాత్రమే శాసన మండలిలో చెప్పటం జరిగిందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. 55 శాతం నిర్మాణం పూర్తయిన వాటిని వీలైనంతా వేగంగా పూర్తి చేస్తామన్నారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీలో దుర్బాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని మంత్రి తప్పుపట్టారు. విశాఖ మెట్రోను రెండు దశలుగా చేపట్టాలని నిర్ణయించామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయమై మరోసారి టెండరుకు వెళ్లాలనే విషయంపై ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు. -
పుకార్లను నిజమని నమ్మించేందుకు ఆపసోపాలు..
బొబ్బిలి: ప్రతిపక్ష నేత చంద్రబాబే స్వయంగా పుకార్లను ప్రచారం చేస్తూ.. వాటిని నిజం చేసేందుకు ఆపసోపాలుపడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వార్డు సచివాలయాన్ని ఆదివారం ప్రారంభించాక జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినవారిని వేదికపైకి పిలిచి వారితో మాట్లాడించారు. సీతానగరం మండల కేంద్రానికి చెందిన శాంతికుమారి మాట్లాడుతూ తాను గతంలో ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా.. డబ్బులు ముట్టజెప్పలేకపోయినందున ఏ ఉద్యోగం రాలేదని, కానీ ఇప్పుడు ఎవరికీ డబ్బులు చెల్లించకుండానే సచివాలయ ఉద్యోగం వచ్చిందని ఆనందంగా చెప్పారు. తెర్లాం మండలం నందబలగకు చెందిన సత్యవతి మాట్లాడుతూ తాను ఎమ్మెస్సీ చదివానని.. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు కట్టి ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని చూసి.. ఆ స్థోమత లేని తనకు ఈ జన్మకు ఉద్యోగం రాదనుకున్నానని, అయితే ప్రభుత్వం మారాక సచివాలయ ఉద్యోగానికి దరఖాస్తు చేసి దానిని సాధించానని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు తదితరులున్నారు. -
అవసరమైతే ఆయనతో చర్చకు సిద్ధమే...
రాష్ట్రరాజకీయాల్లో ఆయనదో వినూత్న ఒరవడి. ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చి పదవులకే వన్నె తెచ్చిన నాయకుడతను. పల్లెలో పుట్టినా... ఢిల్లీవరకూ ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారాయన. ఉత్తరాంధ్ర రాజకీయ ఉనికిని రాష్ట్రవ్యాప్తం చేసిన ఘనుడాయన. ఎంత ఎత్తుకు ఎదిగినా... తన ఎదుగుదలకు పునాదివేసిన విజయనగరం జిల్లాను... అందునా చీపురుపల్లి నియోజకవర్గంపైనా అమిత ప్రేమాభిమానాలున్నాయి. అక్కడి వారందరి హృదయాలను గెలుచుకుని... వారి ప్రేమాభిమానాలే ఊపిరిగా సాగుతున్న ఆయనే మన బొత్స సత్యనారాయణ. వైఎస్సారసీపీ రాష్ట్రనాయకునిగా ఓ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.... చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాపైనా... నియోజకవర్గం అభివృద్ధిపైనా ఆయనకున్న లక్ష్యాలను సాక్షి ప్రతినిధికి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మొదటిసారిగా ఎమ్మెల్యేగా 2004లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాను. చీపురుపల్లి, గరివిడి రెండు మండలాలు, అటు జి.సిగడాం, పొందూరు రెండు మండలాలు నియోజకవర్గంగా ఉండేవి. ఆ రోజుల్లో ఇవన్నీ మెట్ట ప్రాంతాలు. చీపురుపల్లి, గరివిడి ప్రాంతాల్లో వరి పంట ఎక్కువగా పండుతుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నది నా ఆకాంక్ష. అందుకే నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఇక్కడివారందరికీ మాటిచ్చా. రాజశేఖరరెడ్డి గారు వస్తారు. ఈ నియోజకవర్గానికి తోటపల్లి నీటిని తీసుకు వస్తానని చెప్పాను. ఈ రెండు ప్రాంతాలతో పాటు అటు ఎచ్చెర్ల, ఇటు మెరకముడిదాం ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు అప్పట్లో రాజశేఖరరెడ్డి గారితోనే పనులకు శంకుస్థాపన చేయించి, పనులు మొదలు పెట్టాం. ఆపడానికి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా అందరినీ ఒప్పించి, మంచి ప్యాకేజీ ఇప్పించి సమస్య పరిష్కరించాను. ప్రతిగ్రామానికీ తాగునీరందించాం రెండోసారి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా చాలా సమస్యలు పరిష్కరించాను. అప్పట్లో ప్రతీ గ్రామానికి తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది. సంప్ దగ్గర బోరు తవ్వించి గ్రావిటీ మీద పైపులైన్ వేసి ప్రతీ గ్రామానికి తాగునీటి ట్యాంకు కట్టి సిగడాం, పొందూరు గ్రామాలకు కూడా తాగునీటిని అందించాను. 2009లో గుర్ల, మెరకముడిదాం మండలాలు కలిశాయి. పొందూరు, సిగడాం శ్రీకాకుళం బోర్డర్లో ఉండటం వల్ల అవి శ్రీకాకుళంలో కలిశాయి. అప్పటికి తోటపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తిచేశాం. మెరకముడిదాం, గరివిడి మండలానికి కూడా తాగునీటిని అందించాం. మొత్తమ్మీద మూడు మండలాల్లోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించాం. ప్రతి పల్లెకు రహదారులు ఈ గ్రామాల్లో రోడ్లు లేవు. ఒక్కో మండలానికి 50 గ్రామాలు అనుసంధానమై ఉండేవి. మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి మండలాలకు 90 శాతం అంటే దాదాపు 130, 140 గ్రామాలకు పక్కా తారురోడ్లు వేశాం. ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్లిన తారురోడ్డుతో లింక్ చేశాం. ఊరిపేర్లతో బోర్డులు ఏర్పాటు చేశాం. డిగ్రీ కళాశాలను తీసుకు వచ్చాం. పాలిటెక్నికల్ కాలేజీని తీసుకు వచ్చాం. గరివిడి , చీపురుపల్లి మేజర్ పంచాయతీల్లో ఇంటింటికి కుళాయిలు ఇచ్చేలా చేశాం. ప్రతి పనికీ తెలుగుదేశం నాయకులు అడ్డుతగిలారు. ఇవేవీ జరిగే పనికాదనీ, అలా ఇస్తే మేం రాజకీయ సన్యాసం తీసుకుంటామని కూడా సవాల్ విసిరారు. అయినా చేసి చూపించాం. రాష్ట్రానికి చీపురుపల్లి రోల్‌మోడల్ అయ్యేది గ్రామాల్లో వచ్చే సమస్యలు అక్కడ ఒక దగ్గరే రావు. ప్రతీ విషయాన్ని రాజశేఖరరెడ్డి గారితో పంచుకునే వారం. నేను 2004లో మంత్రి అయినప్పుడు జిల్లాలోని ఏ గ్రామానికి పోయినా అత్యధికంగా పూరిపాకలే ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా 80 నుంచి 90 శాతం పక్కా ఇళ్లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద 3 నుంచి 4 లక్షల ఇళ్లు కట్టించాం. ఎండాకాలం వస్తే రోజూ రాత్రిళ్లు ఫైరింజన్ల సైరన్లే వినిపించేవి. వాటికి ఇప్పుడు పనే లేకుండా పోయింది. ఈ అయిదేళ్ల టీడీపీ పాలన చూస్తే.. మా ఊరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ప్రజలు చెబుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతుంటే బాధగా ఉంటుంది. కమిట్మెంట్ ఉంటేనే ఏదైనా... రాజకీయాలకు కమిట్మెంట్ ఉండాలి. అది లేకపోతే కష్టం. ఏ సమస్య వచ్చినా దానిపైనే దృష్టి నిలపాలి. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తున్న నాయకులకు సమస్య ఎక్కడ ఉందో తెలియదు. కేంద్ర మంత్రికి గాని, రాష్ట్ర మంత్రికి గానీ ఏమీ తెలీదు. సమస్యలు తెలుసుకునేందుకు సమయం కేటాయించరు. ఎవరైనా చెబితే వినరు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయరు. పెండింగ్ పనులపైనే నా దృష్టంతా... నేను వదిలేసిన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం, తోటపల్లి నీటిని తీసుకు రావడం మెట్ట ప్రాంతమైన మెరకముడిదాం మండలానికి నీటిని తీసుకు రావడం నాముందున్న లక్ష్యం. మా నియోజకవర్గంలో యువకులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయాలని ఉంది. కొలంబో పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికీ నాకున్న సత్సంబంధాలను ఉపయోగించి విశాఖలో రాజశేఖరరెడ్డిగారి సాయంతో ఏర్పాటుచేసిన బ్రాండిక్స్లాంటి పరిశ్రమలను తీసుకురావాలని ఉంది. అశోక్‌గజపతి క్షమార్హుడు కాదు విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు. ఈ జిల్లా కూడా ముందంజలో ఉండేలా అభివృద్ధి చేయాలి. విజయనగరానికి జూనియర్ కాలేజీని తీసుకు వచ్చింది నేనే. డిగ్రీ కళాశాల కూడా తేవాలనుకున్నాం. విజయనగరంలో యూనివర్సిటీ ఎక్స్టెన్షన్కు 150ఎకరాలు నా హయాంలోనే ఇచ్చాను. ఎలక్షన్ పదిరోజుల ముందు వచ్చి దానిని యూనివర్సిటీగా ప్రకటించి మాదే ఘనత అని టీడీపీ చెప్పుకుంటోంది. భోగాపురం ప్రాజెక్టును కూడా నీరు గార్చారు. వైజాగ్ ఎయిర్‌పోర్టు క్లోజ్ చేస్తే గాని ఇది డెవలప్ కాదనీ, దానిని క్లోజ్ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ డిఫెన్స్ వాళ్లు దానిని విస్తరిస్తామని చెబుతున్నారు. ఆ శాఖ మంత్రిగా చేసింది జిల్లాకు చెందిన అశోక్‌గజపతిరాజు. విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరిస్తున్నారంటే సంవత్సరం ముందు నుంచి దానికి టెండర్లు పిలిచే ఉంటారు కదా. తెలిసి కూడా ఆయన మాట్లాడలేదు. ఈ విషయంలో ఆశోక్ గజపతిరాజును క్షమించరాదు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే రాష్ట్రం విడిపోయాక వెనుకబడిన ప్రాం తం కింద ప్యాకేజీ ఉంటుంది. ఈ విషయాన్ని విభజన చట్టంలో పెట్టించాం. ఈ ప్రాంతం వెనకబాటుపై ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే దాని నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. బుందేల్‌ఖండ్‌కు రూ.16 వేల కోట్లు ఇచ్చారు. అంత డబ్బు మనకూ వస్తుంది. ఆ డబ్బంతా తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఎంతో బాగుండేది. ఈ ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నా ఆ పనులను పట్టించుకోలేదు. వాళ్లకు..మాకూ అదే తేడా తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టి, మోసం చేసి, డబ్బు, అధికారం ఉంది కదా.. అనుకుంటున్నారు. మొదటిసారి ఎంపీ అయినప్పుడు ఎంపీ నిధులు రూ. 50లక్షలు కేటాయించారు. తరువాత అది రూ.కోటి చేశారు. అప్పట్లో బోరు వేస్తే రూ.2వేలు ఖర్చయ్యేది. ఊళ్లోకి వెళ్లి ఒక ఎంపీ బోరు వేయిస్తే ఎంపీగారు బోరువేయించారని ఆశ్చర్యపోయేవారు. నా కన్నా ముందు ఎంపీ అయిన వారు ఏం చేయలేదు. ప్రతీ విషయం కామన్ మ్యాన్‌కు రీచ్ అవ్వాలి కదా. మనకు దాని వల్ల గౌరవం వస్తుంది. ఎంపీ అంటే ఎలా ఉండాలన్న విషయం నా వల్లే అందరికి తెలిసింది. ఆ విషయం నేను గర్వంగా చెబుతాను. మన జిల్లాలో, నా నియోజకవర్గంలో నా ఫోన్ నంబరు అందరికీ తెలుసు. నా నంబర్ మా పీఏలు ఎత్తరు. నేనే ఎత్తుతాను. మళ్లీ మిస్డ్ కాల్ ఉంటే నేనే చేస్తాను. చీపురుపల్లి మండలంలో మా నాయకులు అందరూ నాలా యాక్టివ్ గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పట్టించుకుంటారు. బ్రోకరేజ్‌లు, చేయి చాచడాలు అవేం లేవు. జగన్ సీఎం అయితేనే మంచి జరుగుతుంది ఎన్ఆర్జీఎస్ స్కీంను ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా విజయనగరం జిల్లాలోనే మొదలు పెట్టాం. అప్పటి ఎంపీ ఝాన్సీగారు ఆ పథకంలో నేషనల్ మెంబర్‌గా ఉండే వారు. అప్పట్లో ఉపాధి పనులకు వస్తే పది రోజులకో, 15 రోజులకో కూలి బట్వాడా చేసేవాళ్లం. ఇప్పుడు నాలుగు, ఐదు నెలలు కావస్తున్నా ఇవ్వడంలేదు. అవన్నీ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే స్ట్రీమ్‌లైన్ చేస్తారు. సంక్షేమ పధకాలు అందరూ పొందేలా గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కరిస్తారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక యువకుడిని ప్రభుత్వమే జీతమిచ్చి నియమించి అతని ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు అందే ఏర్పాటు చేస్తారు. బహిరంగ చర్చకు రమ్మనండి ముఖ్యమంత్రి వస్తే ఆయన వెనుకాల వెళ్లడం తప్ప ఆయన చేసింది ఏమీలేదు. ధైర్యంగా చెప్పమనండి. ఆయన్ను, నన్ను డిబేట్‌కు రమ్మనండి. ఏం చేశారో చర్చిద్దాం. మా మీద కామెంట్స్ చేయడం కాదు. ఓపెన్ డిబేట్‌కు రమ్మనండి. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను పది సంవత్సరాలు మంత్రిగా చేశాను. ఏం చేశానో అన్ని చెబుతాను. నేను రెడీ.. సత్తిబాబు అబద్దం చెబుతున్నాడని, ఆ పెద్దలను చెప్పమనండి. పోలవరం ఏడు మండలాల గురించి అప్పట్లో ఇక్కడున్న చీఫ్ సెక్రెటరీలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్లాన్స్ తీసుకెళ్లి వారందరితో మాట్లాడి ఢిల్లీ పెద్దలతో చర్చించి మ్యాప్‌లో డిజైన్ చేయించాను. కేసీఆర్ ఆ గ్రామాలను తిరిగి లాక్కుంటాడని చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. అలా ఎందుకు ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. దానికోసం కేసీఆర్ అయినా, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ అయినా ఎవరైనా ఒకటే. మేం గౌరవం ఇస్తాం..గౌరవం పుచ్చుకుంటాం. మన రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికి జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. -
పవన్ కులాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు
-
‘పవన్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో’..
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. రాజకీయ లబ్ధికోసమే పవన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌లా ఊసరవెల్లిలా తాము మారలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సోదరుడు నాగబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఓటు టీఆర్ఎస్కు వేశానని స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నారంటూ ప్రశ్నించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు హత్యరాజకీయాల్లో ఆరితేరారని, సొంత మామనే వెన్నుపోటు పొడిచారంటూ దుయ్యబట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి పదిరోజులైనా నిందితులను కనిపెట్టకపోవటం ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. పవన్ ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాన్ని కాదని, అధికారపార్టీనని చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఐదేళ్ల పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము బాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. ఆస్తులకోసం అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర కళా వెంకట్రావుది అంటూ మండిపడ్డారు. -
‘రావాలి జగన్... కావాలి జగన్’ సాంగ్ విడుదల
-
చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి అంటూ తెలుగుదేశం నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.. ఆయన ఈ రాష్ట్రానికి ఆస్తి కాదు చీడ..చెద’ అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగలేదు కానీ. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయన్నారు. 2014 వరకు రూ.90 వేల కోట్ల అప్పులు నేడు రూ.2.50 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఎన్టీపీసీ తమకు ప్రభుత్వం కట్టాల్సిన రూ.2,130 కోట్లు బకాయిలు కట్టకపోతే రాష్ట్రానికి కరెంట్ కట్ చేస్తామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందంటే ఇంతకంటే దివాలాకోరుతనం ఇంకేముంటుందని బొత్స ప్రశ్నించారు. గురువారం విశాఖ సిటీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా ఓ సంక్షేమ పథకానికి అడ్వాన్స్ చెక్కులు ఇచ్చిన దాఖలాలున్నాయా? అని అన్నారు. ఉదయం లేచింది మొదలు జగన్ నామస్మరణ చేస్తున్నాడే తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఓ ప్రతిపక్ష నేతను సంస్కారహీనంగా మాట్లాడడం చూస్తుంటేæ బాబులో అహంకారం, పొగరు, తలబిరుసుతనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. ఢిల్లీ దీక్ష కోసం రైళ్లలో జనాల్ని తరలించేందుకు రూ.1.38 కోట్లు రైల్వే శాఖకు కట్టారంటే ప్రజాధనం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. నేతలు గుడివాడ అమర్నా«థ్, మళ్ల విజయప్రసాద్, పలువురు పార్టీ కో–ఆర్డినేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయటానికే వారి కుట్రలు’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయటానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం ఆటకెక్కించిందని మండిపడ్డారు. తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శించారు. 1183 కోట్లు ఇస్తే 80 శాతం మందికి న్యాయం జరుగుతుందని, కానీ ప్రభుత్వం దగ్గరనుంచి స్పందన లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినేట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశం లేదని, కానీ టీడీపీ గెజిట్ పత్రికల్లో అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు.. అని రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ అంశం ఎక్కడా తేకపోవడం దురదృష్టకరమన్నారు. సీబీసీఐడీ వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తుల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ వాచ్‌డాగ్‌లా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడిందని తెలిపారు. ఫిబ్రవరి 4న విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బినామీ ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘అఖిలపక్షం కాదు.. పక్షాలు పోయాయి, పక్షులు మిగిలాయి.. టీడీపీ ఏకాకిగా మిగిలింది’ అంటూ ఎద్దేవా చేశారు. -
విజయనగరం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
-
కేంద్రంతో చంద్రబాబు లాలూచీ
-
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
-
రాజకీయ ‘రచ్చ’బండ
బొబ్బిలి/రూరల్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని ఆ పార్టీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారు. బొబ్బిలి రాజులు, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతు న్న రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా రు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఆయన ఆ పార్టీలో ఉన్న కొంతమందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా ఉత్తర్వులు జారీ చేసేంది. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి అధికారికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో మంత్రి బొత్స బొబ్బిలిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏకంగా మం డలానికి ఒక కమిటీని నియమించారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ కార్యవర్గ సభ్యుడు శంబంగి వెంకట చినఅప్పలనాయుడుకు తెర్లాం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ప్రత్యేక స్థానం కల్పించారు. సర్పంచ్‌లను చైర్మన్లుగా, మిగతా అధికార పార్టీ పెద్దలను సభ్యులుగా నియమించారు. దీనికి జిల్లా యంత్రాంగం ఆమో దం తెలిపి ఆయా మండల, మున్సిపాలిటీలకు ఉత్తర్వు లు జారీ చేసింది. వారి ఆధ్వర్యంలోనే రచ్చబండ నిర్వహించాలని పేర్కొరింది. బొబ్బిలి పురపాలక సంఘానికి శంబంగితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడులను కమిటీగా నియమిస్తూ మున్పిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యూరుు. అలాగే బొబ్బిలి మండలానికి శంబంగితో పాటు ఆయన సోదరుడు పక్కి సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బొద్దల పద్మావతిలను కమిటీగా వేశారు. తెర్లాంలో నందబలగ సర్పంచ్ గుల్లి పల్లి శ్రీనివాసరావు చైర్మన్‌గా, ఆ మండల అధికార పార్టీ నాయకుడు నర్సుపల్లి బాబ్జీరావు, రాజయ్యపేట సర్పం చ్ గవర సత్యవతిలను సభ్యులుగా నియమించారు. బాడంగిలో శంబంగితో పాటు సర్పంచ్ చొక్కాపు ఆది లక్ష్మి చైర్మన్‌గా, డీసీసీబీ డెరైక్టర్ వాసిరెడ్డి తిలక్ కిరణ్ కుమార్ సభ్యులుగా కమిటీని వేశారు. రామభద్రపురం మండలానికి శంబంగితో పాటు దుప్పలపూడి సర్పంచ్ మరవ సత్యవతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములునాయుడులను కమిటీగా నియమించారు. నియోజకవర్గంలో పట్టుకోసమే... రచ్చబండ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నా యకులు పక్కా ప్రణాళికతో ప్రజల వద్దకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. బొబ్బిలిలో ఉంటున్న ఓ నాయ కుడు ముందుగానే ఆయూ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ వారికి, తమను నమ్ముకున్న వారికి ఎలాగైనా పింఛన్లు, ఇళ్లు ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేకాధికారులతో సంతకాలు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఏదిఏమైనా ఆ పార్టీ నాయకులు రచ్చబండను రాజకీయంగా ఉపయో గించుకుంటున్నారు.