సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
♦జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
♦జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
♦ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
♦ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
♦ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
♦ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
♦ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
♦ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
♦ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
♦ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
♦ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
♦ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
♦ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
♦ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
♦ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
♦ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
3వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
♦ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
♦ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
♦ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
♦ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
♦ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
♦ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
♦ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
♦ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
4వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
♦ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
♦ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
♦ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
♦ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
♦ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
♦ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
♦ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
♦ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
►పంచాయితీ ఎన్నికలు జరిగే మొత్తం మండలాలు- 659
►తొలిదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 173
►రెండవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 169
►మూడవదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 171
►నాలుగవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 146
Comments
Please login to add a commentAdd a comment