
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
క్రూరమైన ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాం
ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయం గెలుస్తుంది
కూటమి ప్రభుత్వ వేధింపుల నేపథ్యంలో జననేత భరోసా
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య సూత్రాలను, మానవహక్కులను కాలరాసి మరీ సోషల్‌మీడియా యాక్టివిస్టులను భయకంపితులను చేస్తున్న, దారుణంగా హింసిస్తున్న అత్యంత క్రూరమైన ప్రభుత్వంతో పోరాడుతున్నామని, ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఈ అనైతిక యుద్ధంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో నిజం పక్షాన నిలబడిన ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్ట్ చేశారు.
కాగా, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను కూటమి ప్రభుత్వం అడ్డూ, అదుపు లేకుండా వేధింపులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులందరికీ అండగా ఉంటానని వైఎస్ జగన్ ధైర్యం నూరిపోశారు.
We are fighting a draconian government which is terrorising SM activists by flouting all democratic principles and human rights. I am with each of the SM activist who stands for truth.#WeStandForTruth#WeAreWithYSRCPSM
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2024

Comments
Please login to add a commentAdd a comment