సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు(శుక్రవారం) పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అక్కడ ప్రజలు, రైతులను వైఎస్ జగన్ కలువనున్నారు.
కాగా, వైఎస్ జగన్ రేపు పిఠాపురంలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో మాధవరం, నాగులపల్లి, రమణక్కపేలో వరద బాధితులను పరామర్శించనున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పిఠాపురంలో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
వైఎస్ జగన్.. శుక్రవారం ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యూ.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు. అనంతరం.. రమణక్కపేట వెళతారు. అక్కడ బాధితులని పరామర్శిస్తారు.
రేపు (13.09.2024) కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan గారు పర్యటన
ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల్లో పర్యటన
ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి…— YSR Congress Party (@YSRCParty) September 12, 2024
ఇది కూడా చదవండి: పవన్‌పై పిఠాపురం ప్రజల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment