సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నేతలు ఫైరవుతున్నారు.
► నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి
పవన్ కల్యాణ్ తండ్రి పరువు తీశాడు. చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ మాట్లాడాడు. రాజకీయాలకు పవన్ కల్యాణ్ పనికిరాడు.
► మల్లాది విష్ణు..
పవన్‌కు సిద్ధాంతం, నైతిక విలువలు లేవు. ప్రజాప్రతినిధులను దుర్బాషలాడటం సరికాదు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ.
► కిలారి రోశయ్య..
పవన్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. కాపులకు పవన్ చేసింది శూన్యం. దిశ, దశ లేని పార్టీగా జనసేన మిగిలిపోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్.
► అంబటి రాంబాబు..
జనసైనికులా? బాబు బానిసలా. యుద్ధానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం.
జనసైనికులా ?
— Ambati Rambabu (@AmbatiRambabu) October 19, 2022
బాబు బానిసల ?
Comments
Please login to add a commentAdd a comment