nallapu reddy prasanna kumar reddy
-
టీడీపీకి ఎదురుదెబ్బ..YSRCPలో చేరిన టీడీపీ నాయకులు
-
‘చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు.. పవన్‌కు నైతిక విలువలు లేవు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నేతలు ఫైరవుతున్నారు. ► నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి పవన్ కల్యాణ్ తండ్రి పరువు తీశాడు. చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ మాట్లాడాడు. రాజకీయాలకు పవన్ కల్యాణ్ పనికిరాడు. ► మల్లాది విష్ణు.. పవన్‌కు సిద్ధాంతం, నైతిక విలువలు లేవు. ప్రజాప్రతినిధులను దుర్బాషలాడటం సరికాదు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ. ► కిలారి రోశయ్య.. పవన్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. కాపులకు పవన్ చేసింది శూన్యం. దిశ, దశ లేని పార్టీగా జనసేన మిగిలిపోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్. ► అంబటి రాంబాబు.. జనసైనికులా? బాబు బానిసలా. యుద్ధానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం. జనసైనికులా ? బాబు బానిసల ? — Ambati Rambabu (@AmbatiRambabu) October 19, 2022 -
ప్రజలు చంద్రబాబును మర్చిపోయారు: ప్రసన్నకుమార్ రెడ్డి
-
మాట ఇచ్చారు.. నెరవేర్చారు
టీడీపీ ఐదేళ్ల పాలనలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వ్యర్థాల నీటిని తాగి వ్యాధులబారిన పడ్డారు. దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి హయాం నుంచి నల్లపరెడ్ల వైపే కోవూరు నియోజకవర్గ ప్రజలు నమ్మకముంచారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి తమ గోడును చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.56 లక్షలతో వాటర్ప్లాంట్లు మంజూరు చేయించారు. దీంతో మత్స్యకారులతో పాటు మిగతా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదాలకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాటర్ప్లాంట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూ.56లక్షలు మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన తనకు ప్రజలు తాగునీటి సమస్యలు వివరించారన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పనులకు సంబంధించి త్వరితగతిన ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు కలెక్టర్ శేషగిరిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల కేటాయింపు ఇలా.. ►విడవలూరు మండలం కొత్తూరు దగ్గరలోని పాతూరులో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించినట్లు ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ►విడవలూరు మండలంలోని బుసగాడిపాళెం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ►విడవలూరు మండలంలోని రామతీర్థం పంచాయతీ రామలింగాపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చారు. ►విడవలూరు మండలంలోని దంపూరు పంచాయతీ రామచంద్రాపురం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చే శారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలో పైప్లైన్ల రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి రూ.5 లక్షలు కేటాయించారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలోని నివాసగృహాల తాగునీటి కుళాయిల కనెక్షన్ల కోసం రూ.లక్ష ఇచ్చారు. ►కోవూరు పట్టణంలోని నందలగుంట గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కోవూరు పట్టణంలోని పెళ్లకూరుకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు నిధులు ఇచ్చారు. ►కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►కోవూరు మండలం వేగూరు పంచాయతీ సీతారామపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కొడవలూరు మండలం ఆలూరుపాడు ఎగువమీద గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరుచేశారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. -
టీడీపీకి షాక్
నెల్లూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామనుకున్న తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుక, వెంకటసుబ్బమ్మ (కొత్తూరు), కైలాసం సుప్రియ (ఇందుకూరుపేట బిట్–2)ఎంపీటీసీలు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ కైలాసం వెంకటకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ లేబూరు వెంకురెడ్డి కూడా హైదరాబాద్ లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాయుడుపేట టీడీపీ కౌన్సిలర్ మచ్చా రమణమ్మ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇందుకూరు పేట మండలంలో కైలాసం ఆదిశేషారెడ్డి కుటుంబం పార్టీ కోసమే పనిచేస్తోంది. ఆదిశేషారెడ్డి గతంలో మండలపరిషత్ అధ్యక్షుడుగా, జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మండలంలో ఈయనకు వ్యక్తిగతంగా పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో తన భార్య రేణుకతో పాటు మరికొంత మంది ఎంపీటీసీలను ఆయన గెలిపించుకోగలిగారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి అటు కైలాసం కుటుంబం టీడీపీతో అంటీముట్టనట్లు ఉంటోంది. ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత తీవ్రం కావడం, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతున్న తీరుకు కైలాసం ఆకర్షితులయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలను నిరసిస్తూ వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను పసిగట్టిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వీరిని నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలోనే ఉండాలని వారి మీద అనేక రకాల్లో ఒత్తిడి చేయడంతో పాటు, పార్టీని వీడితే ఇబ్బందులు పడతారని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వీటిని లెక్క చేయకుండా ఆదిశేషారెడ్డితో పాటు భార్య రేణుక, ఇద్దరు ఎంపీటీసీలు, పలువురు టీడీపీ నేతలు గురువారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నల్లపురెడ్డి రజత్ కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి విజయం కోసం గట్టిగా పనిచేయాలని జగన్ వీరికి సూచించారు. జగన్ పనితీరు చూసే పార్టీలోకి... ఎంపీపీ రేణుక ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని చూసే పార్టీలో చేరుతున్నామని మండల పరిషత్ అధ్యక్షురాలు కైలాసం రేణుక చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి తమ కుటుంబం మొత్తం కష్టపడుతుందని ఆమె తెలిపారు. మేకపాటి సమక్షంలో నాయుడుపేట కౌన్సిలర్ చేరిక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయుడుపేట 11వ వార్డు కౌన్సిలర్ మచ్చా రమణమ్మ గురువారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరులోని తన ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కౌన్సిలర్ రమణమ్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ రఫీ, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.