సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో విపక్షాలు బురద చల్లుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. మంగళవారం ఆయన విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత కుళ్లు అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. గోదావరి వరదలతో ప్రజలు బాధలు పడుతుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘ప్రతినెలా ఒకటో తేదీనే వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది. నిర్మాణాత్మక వ్యవస్థను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని’’ ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment