Karanam dharma sree
-
‘పేదల గౌరవం పెంచిన సీఎం జగన్’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ కీలక నేతలు అన్నారు. మంగళవారం జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర తదనంతర బహిరంగ సభలో వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని జనాలకు వాళ్లు తెలియజేశారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో ఈ సభ జరిగింది. ‘‘గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. దళితుల్ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. కానీ, వెనుకబడిన వర్గాలను జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసిన నాయకుడు జగన్. కేబినెట్లో.. నామినేటెడ్ పోస్టుల భర్తీల్లోనూ వెనుకబడిన వర్గాల వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమం అందించాం. కుల, మత.. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సంక్షేమ పథకాలు అందించాం. .. సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రూ.2.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధి దారుల ఖాతాలో జమ చేశాం. ఇచ్చిన హామీలు సీఎం జగన్ నెరవేర్చారు. కానీ, ప్రభుత్వంపై టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం. ప్రజలు సీఎం జగన్నే మళ్లీ కోరుకుంటున్నారు’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘‘రూ. 1,900 కోట్లతో చోడవరం నియోజక వర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రూ. 80 కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో రోడ్లను ఏర్పాటు చేశాం. విద్యా రంగంలో నాడు నేడు కోసం రూ.87 కోట్లు ఖర్చు చేశాం. జనసేన-టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోలేరు. జయహో జగన్.. అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడమే దీనికి నిదర్శనం. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సభకు వచ్చిన జనాలను చూస్తే వార్ వన్ సైడ్ అవుతుందనిపిస్తోంది. కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. సీఎం జగన్.. సుదీర్ఘ కాలం పాదయాత్ర ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. జిల్లాకు ఒక మెడికల్ ఏర్పాటు చేశారు. కాబట్టి.. 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుంది. ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు,బలహీన వర్గాల్ని అవమానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?. రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువల్లే టీడీపిని ప్రజలు పక్కన పెట్టారు. ఆకలి తీర్చే నాయకుడు కావాలో-మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. టీడీపీకి జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ అవసరం అయినప్పుడు తన పార్టీని తాకట్టు పెడుతున్నారు. తెలంగాణలో పవన్‌కు డిపాజిట్లు రాలేదు. బర్రెలక్కకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్,చంద్రబాబు,లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదు వీళ్లకు. సీఎం జగన్ ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారు. మంత్రి కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ హయాంలో రూ.400 కోట్లు కూడా చోడవరం కోసం ఖర్చు చేయలేదు. అదే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,900 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు ఇవ్వాలని ఆదేశించారు. అదే సీఎం జగన్ .. అర్హులైన వాళ్లందరికీ పథకాలు వర్తింపజేయాలని చెప్పారు. ఇచ్చిన ప్రతీ హామీనే కాదు.. ఇవ్వని మరికొన్ని హామీల్ని కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్యా విప్లవం తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో వ్యవసాయం తిరోగామిలోకి వెళ్లింది. అదే వైఎస్సార్సీపీ హయాంలో మాత్రం అభివృద్ధి పెరిగింది. ఆ టైంలో జీడీపీ 16వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. పేదల ఖాతాల్లో 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత సీఎం జగన్‌దే. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన ఏపీలో సాగుతోంది. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు. నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూలా మార్పులు తెచ్చారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అవుతుంది. అన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. -
‘ఉక్కు సత్యాగ్రహం’ లో భాగం చేయడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే కరణం
పి.సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, జనం ఎంటర్టైన్మెంట్స్పై స్వీయ దర్శకత్వంలో నిర్మిం చిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. శుక్రవారం సత్యారెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ–‘‘విశాఖపట్నం ఉక్కు నేపథ్యంలో సత్యారెడ్డి ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా తీసుకురావడం చాలా మంచి విషయం. ఈ చిత్రంలో నన్ను కూడా ఓ భాగం చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘నేనొక కమర్షియల్ డైరెక్టర్ అయినా నాకు ఉద్యమంతో కూడిన, ప్రజా సమస్యలతో కూడిన ఉద్యమాలు చేసే సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు పి.సత్యారెడ్డి. నిర్మాత దాసరి కిరణ్, దివంగత గాయకులు గద్దర్ కుమార్తె వెన్నెల, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ క్వారీలను నడిపింది మీ ఎమ్మెల్యేనే..
అనకాపల్లి: గ్రానైట్ క్వారీలకు తాను మొదటి నుంచి వ్యతిరేకినని, గతంలో టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా వాటిని నడిపేవారని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మైదాన గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చడం మంచిదేనని, అది తన పరిధిలో లేని అంశమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చీమలపాడు గ్రామానికి విచ్చేసిన ఆయన కారు వద్దకు టీడీపీ గ్రామ నాయకులు గోర సంజీవ్, వెంకటరమణ, బొండా దేముడు, జనసేన కార్యకర్త కొత్తెం అప్పారావు వెళ్లారు. తమ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏలో చేర్చాలని, కల్యాణపులోవ ప్రాంతంలో గ్రానైట్ క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దని నినాదాలు చేయగా ధర్మశ్రీ పై విధంగా స్పందించారు. ఏమైనా సమస్యలున్నాయా... అనంతరం గిరిజన గ్రామాలైన కల్యాణపులోవ, ములకలాపల్లి, చీమలపాడులో సోమవారం ధర్మశ్రీ ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైనా బిల్లులు రాలేదని కల్యాణపులోవలో బొండా రమణమ్మ తదితరులు వాపోయారు. గువ్వమ్మ, రాజమ్మలకు ఇళ్ల స్థలాలు, సెగ్గె చిన్ని, రాజులమ్మలకు ఇళ్లు మంజూరు చేస్తామని ధర్మశ్రీ హామీ ఇచ్చారు. ములకలాపల్లిలో రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీటీసీ చిన్ని చినమ్మలు కోరగా రూ.10 లక్షల టీటీడీ నిధులతో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పైల రాజు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఎంపీడీవో వెంకన్నబాబు, కొత్తకోట సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్, డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, సర్పంచ్ ఒంజరి గంగరాజు, మండల సచివాలయ కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు పాల్గొన్నారు. -
ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
-
అయ్యన్నపై ఆగ్రహం
-
సబ్బం హరి కాదు.. పబ్బం హరి
పెదగంట్యాడ (గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పబ్బం గడుపుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రూ.3 కోట్ల విలువైన 212 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. శనివారం ధర్మశ్రీ పెదగంట్యాడలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► కేవలం 5 అడుగుల స్థలంలో బాత్రూమ్ మాత్రమే నిర్మించామని సబ్బం చెప్పడం విడ్డూరంగా ఉంది. ► ఆక్రమణను తొలగిస్తామని జీవీఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తే.. వాటిని ఆయన బేఖాతరు చేశారు. సబ్బం మేయర్‌గా ఉన్న సమయంలోనే సీతమ్మధారలో స్థలం కొనుగోలు చేసి.. తర్వాత ఆ స్థలం వెనుక ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించారు.అది ప్రభుత్వ స్థలమని అప్పట్లోనే వామపక్షాలు ఆందోళనలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్న సబ్బం రికార్డులను టాంపరింగ్ చేశారు. -
దళితునికి చిత్రహింసలు పెట్టారు
-
ఎందుకంత కుళ్లు..
-
ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత కుళ్లు..
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో విపక్షాలు బురద చల్లుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. మంగళవారం ఆయన విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత కుళ్లు అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. గోదావరి వరదలతో ప్రజలు బాధలు పడుతుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘ప్రతినెలా ఒకటో తేదీనే వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది. నిర్మాణాత్మక వ్యవస్థను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని’’ ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు. -
ప్రజాసేవ.. కాసింత కళాపోషణ
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆసక్తి.. అభిరుచి ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చినా.. మనసుకు నచ్చిన రంగంలో రాణిస్తూ తన అభిరుచిని చాటుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు మన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ప్రజా సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఇష్టం. నాటకాలు వేశారు. సినిమాల్లో నటిస్తున్నారు. హరికథలు చెబుతారు.. ఇలా తనలోని కళాకారుడిని తట్టి లేపుతూ.. కళామ్మతల్లి సేవలో తరిస్తున్నారు. అయితే సందేశాత్మక చిత్రాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. హర్మోనియం, తబలా వంటి వాయిద్యాల నిర్వహణలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. రచయితగా, కవిగా కూడా ధర్మశ్రీ చోడవరం ప్రసన్నభారతిలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటికే ‘దుర్గి’తోపాటు పలు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా మరో సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చోడవరం : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పోలాకి శివ దర్శకత్వంలో శ్రీ మోదశివ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘జై మోదకొండమ్మ’ సినిమాలో ఎమ్మెల్యే ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అమ్మవారి చరిత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమ్మవారిగా ప్రముఖ హీరోయిన్ ప్రేమ నటిస్తుండగా.. సద్గురువు పాత్రలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతోంది. హోం క్వారంటైన్లో ఉంటూనే ధర్మశ్రీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను తన ఇంటి వద్దే సెట్ వేసి పూర్తి చేస్తున్నారు. సద్గురుపాత్రలో ఆయన చేస్తున్న నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లు తెరిచిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమాకే బంగారు ‘నంది’ 2009లో ధర్మశ్రీ నటించిన తొలి సినిమాకే బంగారు నంది అవార్డు దక్కింది. ఒడిశా గిరిజన తండాలోని ఓ బాలిక యదార్థగాథపై తీసిన ‘దుర్గి’బాలల చిత్రంలో బాలిక దుర్గికి తండ్రిగా అప్పన్న పాత్రలో ధర్మశ్రీ కీలకపాత్ర పోషించారు. మెుదటిసారిగా వెండి తెరపై ఆయన కనిపించి.. పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అందరి మన్ననలు పొందారు. తాజాగా జై మోదకొండమ్మ సినిమాలో ఆయన నటించడంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. కళలంటే చాలా ఇష్టం ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్నప్పటికీ చిన్నతనం నుంచి కళారంగంపై నాకు ఆసక్తి ఎక్కువ. వీధి నాటకాలు, కళాశాలల్లో స్టేజీ నాటకాలు వేసేవాడిని. పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే నా జీవితం గడవడం వల్ల.. పల్లె కథలంటే నాకు చాలా ఇష్టం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నమయ్యగా ఏకపాత్రాభినయం చేశాను. నా ప్రదర్శన ఆయనకు ఎంతో నచ్చింది. అప్పటి నుంచి నన్ను అన్నమయ్య అని పిలిచేవారు. నా మొదటి సినిమా దుర్గికి నంది అవార్డు వచ్చింది. తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించాను. తాజాగా మా ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదుకొండమ్మ తల్లి పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ఒక మంచి పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం -
తెలుగు డ్రామా పార్టీ
-
బోటు ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు
సాక్షి, తూర్పుగోదావరి : భవిష్యత్తులో బోటు ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని మంత్రి అవంతీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బోటు ప్రమాదంలో మరణించిన విశాఖపట్నం, అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం, మహారాణిపేటలకు చెందిన తొమ్మిది కుటుంబాలకు రూ.10 లక్షల చెక్‌లను మంత్రి పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి గుడివాడ అమర్ నాథ్, ధర్మశ్రీ, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేలతో పాటు కలేక్టర్ వినయ్ చంద్, విఎం చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని, మృతిచెందిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారు 17మంది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ. 10 లక్షల చొప్పున రూ. 90 లక్షలు ఎక్సగ్రేషియా అందించామని పేర్కొన్నారు. అలాగే బోటును బయటకు తీయడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నామని, బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజులలో బోటు ప్రయాణాలపై నిర్థిష్ట ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనున్నదని మంత్రి వెల్లడించారు. -
‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’
సాక్షి, విశాఖపట్నం : అన్ని వర్గాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. భీమిలిని అభివృద్దిలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన ఆశయం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు సీఎం రూ. 10000 వేలు ఇస్తున్నారు.. అలాగే పద్మనాభం, ఆనందపురం మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. ఇక చోడవరం ఎమ్మల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ఏర్పాటు చారిత్రాత్మకం అన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని అధికారులే దగ్గరుండి మద్యం విక్రయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, దీంతో ఆయన నైజం ఏంటో బయటపడిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు అబద్దాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అక్టోబర్ 2వ తేదీన ఎక్కడా మద్యం దుకాణాలు తెరవలేదని వెల్లడించారు. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక ఆసత్య ప్రచారం చేస్తున్నారని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 43 వేల బెల్టు షాపులను మూసివేయించారని తెలిపారు. రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గిపోయాయని, 2018 జూన్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు 126 లక్షల కేస్ల మద్యం విక్రయాలు జరిగితే.. తమ ప్రభుత్వం వచ్చాక 105 లక్షల కేసులు తగ్గిపోయాయన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న రాజకీయ ప్రకటనల్లో ఒక్కటైనా రుజువు చేయగలరా అని ఆయన సవాలు విసిరారు. -
గవర్నర్ ప్రసంగం అద్భుతం
-
30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక
చోడవరం : అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం పట్టణంలో యాతపేట, చందక వీధి ప్రాంతాలకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ధర్మశ్రీ గురువారం సాదరంగా ఆహ్వానించారు. రెడ్డి సంతోష్, చందక గోవింద, చందక రాము, రెడ్డి చినవెంకటరావు, అనుసూరి శ్రీనివాసరావు, రెడ్డి వాసు, త్రినాద్, సంతోష్‌కుమార్, కాకర గిరి, ఎన్. శివ, ఎం. మహేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్సీపీ యుగమని, జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే పథకాలు అమలవుతాయన్నారు. పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారిశెట్టి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు పుల్లేటి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, పట్టణయూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ పాల్గొన్నారు. -
చోడవరంలో కొనసాగుతున్న బంద్
చోడవరం(విశాఖ): విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు నిర్బంధం నడుమ బంద్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసినా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు నడవ లేదు. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించటంతో కర్మాగారం మూతపడింది.