విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు నిర్బంధం నడుమ బంద్ కొనసాగుతోంది.
చోడవరం(విశాఖ): విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు నిర్బంధం నడుమ బంద్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసినా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు నడవ లేదు. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించటంతో కర్మాగారం మూతపడింది.