
పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న ధర్మశ్రీ
చోడవరం : అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం పట్టణంలో యాతపేట, చందక వీధి ప్రాంతాలకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ధర్మశ్రీ గురువారం సాదరంగా ఆహ్వానించారు. రెడ్డి సంతోష్, చందక గోవింద, చందక రాము, రెడ్డి చినవెంకటరావు, అనుసూరి శ్రీనివాసరావు, రెడ్డి వాసు, త్రినాద్, సంతోష్‌కుమార్, కాకర గిరి, ఎన్. శివ, ఎం. మహేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్‌సీపీ యుగమని, జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే పథకాలు అమలవుతాయన్నారు. పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారిశెట్టి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు పుల్లేటి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, పట్టణయూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ పాల్గొన్నారు.