ముగిసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ | YSRCP Parliamentary Party Meeting Chaired By CM YS Jagan | Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Published Thu, Jul 15 2021 11:39 AM | Last Updated on Thu, Jul 15 2021 4:18 PM

YSRCP Parliamentary Party Meeting Chaired By CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు.

పార్లమెంట్‌లో విశాఖ ఉక్కుపై పోరాడతాం: ఎంపీ మిథున్‌రెడ్డి
భేటీకి ముందు ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతామని పేర్కొన్నారు. దిశ చట్టం ఆమోదం, రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement