parliamentary party meeting
-
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్లో పోరాటం చేయండి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే
సాక్షి, అమరావతి : ‘ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. అభివృద్ధి.. సంక్షేమం చేసి చూపించడం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇందుకోసం ఎంపీలు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు.ఇప్పటికే ఐదు హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచి్చన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీలకు శాఖలు అప్పగించామని, ఆ మేరకు ఎన్ని నిధులు తెచ్చారు.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో అందరి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాలని, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చూడాలని సూచించారు.విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ స్టీల్, కడప ఉక్కుపైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలని సూచించారు. విశాఖలో రైల్వే జోన్‌కు అవసరమైన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలని చెప్పారు.రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, కొత్త వలసలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. 2029లో కూడా పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, దాన్ని 1995లో అమలు చేశానని చెప్పారు. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలని సూచించారు. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చని, ప్రజల తలరాతలు మార్చవచ్చని గతంలో చేసి చూపించామన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వినుకొండ హత్య పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఉనికి కోసం దానికి జగన్ రాజకీయ రంగు వేస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరించారన్నారు. పోలీసుల విచారణలో కూడా అదే విషయం తేలిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.ఉనికి చాటుకోవడానికే జగన్ హింసా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఫేక్ పాలిటిక్స్‌నే నమ్ముకున్నాడని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై నేరస్తుల ఆటలు ఏమాత్రం సాగనివ్వమన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే తానే స్వయంగా విచారణకు వస్తానన్నారు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదన్నారు. -
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. ఆయన అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్… వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్.. వైఎస్సార్సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్ చేసి… నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మా కొడుకు ఏం తప్పుచేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వైఎస్ జగన్ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయిదీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారుఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉందిలోకేష్ పుట్టినరోజున హతుడు ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపించిన ఫొటోలు హంతకుడి ఫొటోలను తల్లిదండ్రులు చూపారుస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారుతన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారుటీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారుమాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారుతప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి15 సంవత్సరాలగా వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉందిచంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరుజరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయిరాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలిచంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలిపోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదురేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారుబుధవారం నాడు నిరసన తెలుపుతాంరాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాంఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలిజరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందిఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు:అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా?ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదుప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలిఅన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలిరాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచికాదుప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయిబుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలిపార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలిఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్ జగన్ ఆదేశంఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశంగత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచాంఅయినా ఇలాంటి ఘటనలు జరగలేదువైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాందాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదుప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాంప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశందీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశంఅందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారుపార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యంఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యతఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలికార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలిరాష్ట్రంలో వైయస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారువారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందిమన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి -
రేపు YSRCP పార్లమెంటరీ సమావేశం
-
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్‌లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. కాగా, కేసీఆర్‌కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేసిన బీఆర్ఎస్.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. -
ప్రజలకు, నాకు దూరం పెంచొద్దు: పీఎం మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీజీ’, ‘ఆదరణీయ’ వంటి గౌరవ సూచకమైన పదాలను ఉపయోగించి తనను సంబోధించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ ఎంపీలకు కోరారు. గురువారం నిర్వహిచంన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బీజేపీ పార్టీలో తాను కూడా ఓ చిన్న కార్యకర్తనని అన్నారు. అయితే తనను పిలిచే క్రమంలో పేరు ముందు, వెనక గౌరవ సూచక పదాలు ఉపయోగించవద్దని అన్నారు. దేశ ప్రజల దృష్టిలో తాను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరినని పేర్కొన్నారు. తనను సంబోధించే క్రమంలో ‘శ్రీ, ఆదరణీయ’ వంటి అనే గౌరవ సూచకమైన పదాలు దేశ ప్రజలకు తనకు మధ్య దూరం పెంచినట్లు అవుతుందని చెప్పారు. ప్రజలు తనను కూడా మీఅందరిలో ఒకడిగానే చూస్తారని పేర్కొన్నారు. ఇక ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడంలో.. బృందంగా అందరి సమృష్టి కృషి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. -
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
-
అవినీతిపరులను కాపాడేందుకే... విపక్షాల ఉద్యమం
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్లే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరును ఆపలేవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఈ సమయంలో, భారత వ్యతిరేక శక్తులు అంతర్గతంగా, వెలుపలా చేతులు కలపడం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆయన.. కొన్ని ‘అవినీతి రక్షణ ఉద్యమం’ ప్రారంభించాయంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. కొందరికి కోపం కూడా వస్తోందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే గతంలో ఇంతగా అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ‘తప్పుడు ఆరోపణలతో దేశం తలవంచదు. అవినీతిపై చర్యలు ఆగవు. భారత వ్యతిరేక శక్తులు బలమైన పునాది వంటి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నాయి. దేశాభివృద్ధిని ఆపేందుకు దాడికి దిగుతున్నాయి. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వాటి విశ్వసనీయతను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి’అని ఆరోపించారు. 2004–14 సంవత్సరాల మధ్య యూపీఏ ప్రభుత్వం మనీలాండరింగ్ ఆరోపణలపై రూ.5 వేల కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోగా 9 ఏళ్లలో తమ ప్రభుత్వం రూ.1.10లక్షల కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయాలకు, తమ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలకు సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతగా విజయాలు సాధిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అంతగా లక్ష్యంగా చేసుకుంటాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై పలు అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శల దాడులు ఎక్కువైనట్లు చెప్పారు. మున్ముందు ఈ విమర్శలు అన్ని స్థాయిల్లోనూ తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. ఏప్రిల్ 6–14 మధ్య సేవా కార్యక్రమాలు బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6 నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజు వరకు సొంత నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమాజంపై ఎంతో ప్రభావం చూపే రాజకీయ నేతలు రాజకీయేతర అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ‘‘విష రసాయనాల నుంచి నేలకు విముక్తి కల్పించాలి. ఎంపీలు కొత్త సాంకేతికతను అలవర్చుకునేందుకు నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలకు మోదీని పార్టీ ప్రశంసించింది. బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 దాకా రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టనున్నట్టు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఓబీసీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో ర్యాలీ చేశారు. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్‌ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. -
బీజేపీ సర్కారు అన్యాయాలపై దేశం దద్దరిల్లేలా నిలదీద్దాం
రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న పలు అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పందన పూర్తిగా కరువైంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. పైగా వివిధ పథకాల కింద రాష్ట్రాలకు విడుదల చేసే నిధులను అర్ధాంతరంగా ఆపేసింది. రాష్ట్రాల్లేకుండా కేంద్రానికి మనుగడ లేదనే అంశాన్ని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చింది. విభజన చట్టం హామీలను గాలికొదిలేసింది. బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత మేర ప్రాధాన్యం లభిస్తుందో చూసిన తర్వాత పార్లమెంటులో నిలదీద్దాం. సాక్షి, హైదరాబాద్: ‘కొత్త రాష్ట్రమైనా ప్రగతిశీల విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష పరాకాష్టకు చేరింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయాలపై గట్టిగా నిలదీద్దాం. అవసరమైతే బడ్జెట్ సమావే శాలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగుదాం. దేశమంతా దద్దరిల్లేలా కొట్లాడదాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రగతి భవన్లో సుమారు ఐదు గంటల పాటు జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. పార్లమెంటు బడ్జెట్ (2022) సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలతో పాటు వివిధ సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధికి సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వచ్చిన మొత్తం 23 అంశాలకు సంబంధించిన పూర్వాపరాలను కేసీఆర్ వివరించారు. ఆయా అంశాలపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఎంపీలకు అందజేశారు. బుక్‌లెట్‌లో పేర్కొన్న ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని లోతుగా విశ్లేషించారు. ఆయా అంశాలపై ఉభయ సభల్లో నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలిసి వచ్చే పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పారు. కేంద్రం వైఖరిపై అసంతృప్తిని తెలిపేందుకు సోమవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా చర్చ సుదీర్ఘంగా సాగిన టీఆర్‌ఎస్‌పీపీ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పార్టీవర్గాల కథనం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే ఫలితాల వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జాతీయ స్థాయిలోనూ ఎండగట్టేందుకు పార్లమెంటును వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలు లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోనే మరోమారు పార్లమెంటరీ పార్టీ భేటీని ఏర్పాటు చేసే అంశాన్ని కేసీఆర్ సూచాయగా ప్రస్తావించారు. రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత డాక్టర్ కె.కేశవరావు, లోక్‌సభ నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, హన్మంతు షిండే, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నాం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాశారు. బడ్జెట్లో వాటికి సంబంధించి ఏమేమి అంశాలు ఉంటాయో లేదో చూసిన తర్వాత మాట్లాడతాం. – రంజిత్‌రెడ్డి, ఎంపీ, చేవెళ్ల టీఆర్ఎస్పీపీలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యాంశాలు.. ► షెడ్యూలు 9,10లోని సంస్థల విభజన ► అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ ► వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు (ఏటా రూ.450 కోట్లు) ► కాళేశ్వరానికి జాతీయ హోదా (రూ.20 వేల కోట్లు) ► రైల్వే ప్రాజెక్టులు వేగవంతం, కొత్త రైల్వే లైన్లు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ► బైసన్‌పోలో భూమి అప్పగింత, హెచ్ఎంటీ అభివృద్ధి ► ఐఐఎం, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, ఐటీఐఆర్‌కు నిధులు ► 23 నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు ► ఎన్టీపీసీలో స్థానికులకు ఉద్యోగాలు ► ములుగులో గిరిజన యూనివర్సిటీ ► రామప్ప గుడి అభివృద్ధి ► మిషన్ భగీరథకు ఆర్దిక సాయం ► బయ్యారంలో స్టీల్ ప్లాంటు ► కొత్త జాతీయ రహదారులు, రోడ్ల విస్తరణ ► ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ► హైదరాబాద్‌లో ఎన్ఐడీ, నిమ్జ్‌కు నిధులు ► రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ, ముస్లింలకు రిజర్వేషన్లు ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ► హైదరాబాద్ – నాగపూర్, హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ► కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు రూ.1,000 కోట్లు -
ముగిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. పార్లమెంట్లో విశాఖ ఉక్కుపై పోరాడతాం: ఎంపీ మిథున్‌రెడ్డి భేటీకి ముందు ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్లో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతామని పేర్కొన్నారు. దిశ చట్టం ఆమోదం, రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. -
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరవుతారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఒత్తిడి పెంచడం, కృష్ణా జలాల వివాదం.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
సీఎం జగన్ అధ్యక్షతన రేపు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు( గురువారం) వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. -
హామీలను గుర్తు చేయండి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని గతంలో కేంద్ర మం త్రులు హామీ ఇచ్చారని, కానీ చాలా కాలంగా పెం డింగ్‌లో ఉన్న వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఎంపీలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న వినతులకు పరిష్కారం దక్కేలా చొరవ తీసుకుని కేంద్ర మంత్రులకు గుర్తు చేయాలని కోరారు. తెలంగాణ భవన్లో శుక్ర వారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి కేటీఆర్ అధ్యక్షత వహిం చారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల విస్తరణ కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా నిమ్జ్ హోదా దక్కినందున నిధుల సాధన వంటి తక్షణ అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐఐఎం వంటి విద్యా సంస్థలతో పాటు బయ్యా రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తదితరాలను ఫాలో అప్ చేయాలన్నారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విజ్ఞప్తులను సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధుల తో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పనిచేయాలన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు..ఆయా శాఖల పరిధిలో ఉన్న పథకా లు, ప్రయోజనాలు తెలంగాణకు తీసుకురావడానికి ప్రయ త్నం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దేశ రాజ ధాని ఢిల్లీలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేత డాక్టర్ కే. కేశవరావు తెలంగాణ భవన్‌కు రాగానే కేటీఆర్ స్వాగతం పలికారు. పార్టీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్ ముదిరాజ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్, పసునూరు దయాకర్, మాలోత్ కవిత, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, రంజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 30 అంశాలకు సంబంధించిన వాటి పురోగతిపై సమావేశంలో సమీక్షించారు. కాగా, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె హాట్ టాపిక్ కావడం, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన మీద పోలీసు దాడి గురించి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడంతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు వ్యూహరచన చేస్తున్నందున ఎలా తిప్పి కొట్టాలనే దానిపైనా కేటీఆర్ సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిందే అక్కడ కూడా వినిపించాలని సూచించారు. చర్చించిన ప్రధాన అంశాలు ఇవే... హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఏర్పాటు రాష్ట్ర పునర్విభన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన బీఆర్జీఎఫ్ డిస్ట్రిక్ట్ గ్రాంటు కింద తదుపరి వాయిదా డబ్బుల విడుదల హైదరాబాద్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఏర్పాటు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు తెలంగాణ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కోల్ బ్లాక్‌ల కేటాయింపు హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.వెయ్యి కోట్ల గ్రాంటు ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పునరుద్ధరణ -
16 ఎంపీ సీట్లు మనవే
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల శాతం ఐదు నుంచి పది శాతం వరకు అదనంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ 16, ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తాయన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం వద్ద పెండింగ్ అంశాల పరిష్కారం, లోక్‌సభ ఎన్నికలపై టీఆర్ఎస్ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను మనమే గెలవాలి. దీని కోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. మీ పరిధిలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో మీకు తెలుసు. వాటిని వెంటనే సరిచేసుకోవాలి. ఎమ్మెల్యేలు మీ కంటే తక్కువ స్థాయి అయినా మీ గెలుపు కోసం తిరిగేది వారే. వారితో సమన్వయంగా ఉండాలి. కలసి పనిచేయాలి. అందరితో మంచిగా మాట్లాడితే పోయేదేమీ ఉండదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితిని వెంటనే చక్కదిద్దుకోవాలి. తుమ్మ ల నాగేశ్వర్రావు, మిగిలిన ముఖ్యలు కలసి మాట్లాడుకోండి. లోక్‌సభ ఎన్నికలు మనకు పూర్తి అనుకూలంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ ఓట్ల శాతం 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటా యో మనకు సమాచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఏడు స్థానాలను ముందే గుర్తించి అభ్యర్థులను మార్చాం. అన్ని స్థానాల్లో గెలిచాం. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పనిచేయండి. మనదే గెలుపు’అని కేసీఆర్ అన్నారు. పెండింగ్ అంశాలపై పోరాటం: జితేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు అంశం సహా అన్ని విషయాలపై కేంద్రాన్ని నిలదీస్తాం. బైసన్ పోలో గ్రౌండ్‌ను సచివాలయం కోసం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తాం. అనేక పెండింగ్ అంశాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ 33 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. 52 అంశాలపై జాతీయ స్థాయిలో పోరాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి మరోసారి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. జనవరి 1 నాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ విషయంలో జాప్యం చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు’అని కేసీఆర్ అన్నారు. సమస్యలపై పోరాటం.. ‘కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పందించడంలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీజేపీ మంత్రులు మాత్రం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రానికి లేఖలు రాస్తే రా యలేదని చెప్పారు. ఎంపీలందరూ కలసి ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించి మనం రాసిన లేఖలను విడుదల చేయండి. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో గట్టిగా పట్టుబట్టాలి. సాగునీటి ప్రాజెక్టుల కు కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో గట్టిగా కొట్లాడాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపైనా పార్లమెంట్లో పోరాడాలి. కేంద్రం ఏ విషయంలో ఎలా నిర్లక్ష్యంగా ఉందో ఎండగట్టాలి. రాష్ట్రానికి సంబం ధించిన 52 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజనలో పెట్టినవి గట్టిగా అడగాలి. సోమవారం నుంచి అధికారులు మీకు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. కొన్ని రోజల తర్వాత నేను ఢిల్లీకి వస్తా. పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లోనే వస్తా. అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా ప్రయత్నాలను గట్టిగా కొనసాగించాలి’అని కేసీఆర్ అన్నారు. పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుంది ‘బుక్‌ఫెయిర్’పై సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 25 వరకు నిర్వహించనున్న 32వ ‘బుక్ ఫెయిర్’ పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుందని సీఎం కేసీఆర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సహకారం తో హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఉన్న తెలంగాణ కళాభారతి వేదికగా జరగనున్న బుక్ ఫెయిర్ శనివారం ప్రారంభం కానుంది. గురువారం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కె.చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్లో కలిసి అభినందనలు తెలుపుతున్న రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు జి.రాజేశం గౌడ్ -
పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తాం: వైఎస్సార్సీపీ
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంపై పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోపాటు ఏపీకి సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని, వీటిని నెరవేర్చాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు తమ అధినేత వైఎస్ జగన్ పార్లమెంటు సమావేశాల్లో తమకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం 31 రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆదివారం రాత్రి కూడేరులోనే వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు వైఎస్ జగన్‌తో చర్చించారు. ఈ నెల 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. -
'ప్రత్యేక హోదా కోసం పట్టుపడతాం'
-
ప్రత్యేక హోదా కోసం పట్టుపడతాం: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్: ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెల్లడించారు. ప్రత్యేక హోదాతోపాటు రైతుల సమస్యలు, జీఎస్టీ ఇబ్బందులు, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ పార్లమెంటురీ పార్టీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని, తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఆనాడు బీజేపీ నాయకులు కూడా చెప్పారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. హోదా కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ కోసం పట్టుబడతామని తెలిపారు. ప్రత్యేక హోదా ఐదుకోట్ల మంది ఏపీ ప్రజల హక్కు అని, దీనిని సాధించుకోవడం అందరి బాధ్యత అని, ఇందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్నివిధాలుగా పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా సభలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీటి పంపకాలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అంశాన్ని కూడా పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. జీఎస్టీ నుంచి చేనేతరంగం, టెక్స్టైల్ రంగానికి మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారని, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని అన్నారు. బిజీగా ఉండటం వల్లే బుట్టా రేణుక రాలేదు.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తన నియోజకవర్గంలో ఇతర పనులతో బిజీగా ఉండటం వల్లే ఈ సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. ఆమె మంత్రి లోకేశ్‌ను కలువడంలో తప్పేమీ లేదని ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు. నిజాయితీ ఉంటే ఎవరిని కలిసినా తప్పులేదన్నారు. తాము కూడా సీఎం చంద్రబాబును కలిశామని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు అన్యాయకరమైన పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. -
వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన రాష్ట్ర సమస్యలు, ఇతర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. -
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. త్వరలో ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితో సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కశ్మీర్ టు కన్యాకుమారి
♦ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేద్దాం ♦ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్‌షా న్యూఢిల్లీ: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు. 2014 లోకసభ ఫలితాలతోనే సంతృప్తి చెందొద్దని, 2019 లో మరింత మంచి ప్రదర్శన ఇచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి సిద్ధం కావాలని పార్టీ నాయకులను కోరారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంపీలందరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ క్షేత్ర స్థాయి వరకు ప్రజ ల్లోకి వెళ్లడం లేదని, పాలనలో ‘నమో (నరేంద్ర మోదీ) ట్రాక్ రికార్డు’ను వివరించాలని సూచించారు. గత లోకసభ ఎన్నికల్లో సాధించిన 272 సీట్లతోనే సంతృప్తి పడవద్దని, మరింత మంచి ఫలితాలు సాధించాలన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు ఎజెండాలతోనే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, బీజీపీని 1980 స్థాపించారు. లోక్‌సభలో ప్రస్తుతం 281 ఎంపీల బలం ఉంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో 1,398 ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. -
నేడు వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
నేడు వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చలు జరపనున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దుకు ప్రజామోదం..
ఈ నిర్ణయం జనశక్తి ప్రాముఖ్యతను తెలియజేసింది ప్రతిపక్షాలకు చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రజలంతా మద్దతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ‘జనశక్తి’ ప్రాముఖ్యతను తెలియజెప్పిందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెం ట్లో నోట్ల రద్దుపై చర్చ జరగాలని విపక్షాలు భావించడం లేదని, రాజ్యసభలో ఈ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. తాను రెండుసార్లు రాజ్యసభకు హాజరైనా చర్చకు వారు అంగీకరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారి తీశాయని, అయినా వాటిపై పార్లమెంట్లో చర్చ నడిచిం దన్నారు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయంపై చర్చకు మాత్రం ప్రతిపక్షాలు అంగీకరించడం లేదని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలి పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ ఎకానమీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారని చెప్పారు. ఓట్ల నమోదు, ఈవీఎంల వినియోగంపై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తామో అదే విధంగా దీనిపై వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారన్నారు. పార్టీలకతీతంగా అందరు ఎంపీలు ఇందులో భాగస్వాములు కావాలని మోదీ కోరారని అనంత్‌కుమార్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ‘రాజ్యశక్తి’ కంటే ‘జనశక్తి’కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నోట్ల రద్దుపై చర్చ జరగాలనే ఉద్దేశం లేదని, అందువల్ల దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పార్టీ సభ్యులు నడుచు కోవాలని సూచించారని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ పార్టీ డిమాండ్ చేయలేదని, అందువల్ల విపక్షాలు చర్చలో పాల్గొని విలువైన సలహాలు అందజేయాలని మోదీ సూచించారన్నారు. -
వారు రాజీనామా చేయాల్సిందే!
ఆ తర్వాతే సమావేశాల్లో చర్చ * పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టంచేశారు. వారి అక్రమాలపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ‘మన్ కీ బాత్’ చాంపియన్ ఈ విషయంలో ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారని నిలదీశారు. సోమవారమిక్కడ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చ జరిగితే లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై ప్రధాని కూడా మాట్లాడతారని, ముందుగా చర్చకు అంగీకరించాలన్న మంత్రి వెంకయ్య చేసిన సూచనను ఆమె తోసిపుచ్చారు. ముందుగా సుష్మా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘అవకతవకలకు పాల్పడినవారు పదవుల్లో ఉన్నంత వరకు చర్చకు అర్థమే లేదు. వారు రాజీనామా చేయాలి. తర్వాతే చర్చ’ అని పేర్కొన్నారు. ‘విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం చట్టబద్ధ వ్యూహంగా మలుచుకున్నవారు ఇప్పుడు మాకు సమావేశాల నిర్వహణ గురించి చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు. అవినీతిపై ప్రధాని మౌనం కారణంగానే సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొందన్నారు. సమావేశాలు జరగాలని, బిల్లులు ఆమోదం పొందాలని తామూ భావిస్తున్నామని, అయితే అవినీతిపై ప్రభుత్వ మొద్దునిద్ర వల్ల తాము ఈ వైఖరి అవలంబించాల్సిన వస్తోందని చెప్పారు.