
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. త్వరలో ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితో సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.