చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్‌ జగన్‌ | Ysrcp Parliamentary Party Meeting Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో అరాచకాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి: వైఎస్‌ జగన్‌

Jul 20 2024 9:23 AM | Updated on Jul 20 2024 4:03 PM

Ysrcp Parliamentary Party Meeting Updates

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా  ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. ఆయన అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌… వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్‌.. వైఎస్సార్‌సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్‌ చేసి… నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

  • మా కొడుకు ఏం తప్పుచేశాడని రషీద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

  • వైఎస్‌ జగన్‌ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

  • కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయి

  • దీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారు

  • ఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.

  • వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.

  • హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది

  • లోకేష్‌ పుట్టినరోజున హతుడు ఎమ్మెల్యే భార్యకు కేక్‌ తినిపించిన ఫొటోలు హంతకుడి ఫొటోలను తల్లిదండ్రులు చూపారు

  • స్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారు

  • తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు

  • టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారు

  • మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారు

  • తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారు.

  • రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి

  • 15 సంవత్సరాలగా వైయస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉంది

  • చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరు

  • జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయి

  • రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయాలి

  • చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి

  • పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు

  • రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతా

  • మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారు

  • బుధవారం నాడు నిరసన తెలుపుతాం

  • రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాం

  • ఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలి

  • జరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది

  • ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.

  • ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు:

  • అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా?

  • ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?

  • రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు

  • ప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలి

  • అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి

  • రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచికాదు

  • ప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి

  • బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలి

  • పార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలి

  • ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశం

  • ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశం

  • గత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచాం

  • అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు

  • వైఎస్సార్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం

  • దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు

  • ప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం

  • ప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం

  • దీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం

  • అందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారు

  • పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం

  • ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత

  • ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి

  • కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి

  • రాష్ట్రంలో వైయస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు

  • వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది

  • మన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement