సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రతో గుంటూరు జిల్లా తాడికొండలో శనివారం సంబరం నెలకొంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారీ్టలు భారీ ఎత్తున హాజరై జైకొట్టారు. బీసీలను సీఎం జగన్ బ్యాక్‌బోన్ కులాలుగా మార్చారని నేతలు కొనియాడారు. సామాజిక సాధికారతను ప్రభుత్వ విధానంగా అమలు చేశారని ప్రశంసించారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికార పదవులు కట్టబెట్టి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం అమలు చేసిన సీఎం జగన్ ఒక్కరే..
సామాజిక సాధికారతకు సీఎం వైఎస్ జగన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కొనియాడారు. వైఎస్ కుటుంబం కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసిన మేకతోటి సుచరితను తాడికొండలో గెలిపించాలని ప్రజలను కోరారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు.
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అవమానించారని గుర్తు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం అనేది నినాదంగా ఉండేదని.. దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. బడుగులకు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం కలి్పంచారని కొనియాడారు. బీసీలు, ఎస్సీల్లో చిచ్చుపెడుతున్న చంద్రబాబు మాయలో పడొద్దని ప్రజలను కోరారు.
దళిత మహిళకు హోం మంత్రి పదవిని ఇచ్చారు..
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ దళిత మహిళగా హోం మంత్రి పదవిని ఊహించుకోలేదని, దాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగనన్న రాత్రికి రాత్రే తనను ఒక స్టార్‌ను చేశారన్నారు. రాష్ట్రంలో తొలి దళిత హోం మంత్రి ఎవరంటే తనపేరే ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. తాడికొండ మాజీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో సమ సమానత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నామని తెలిపారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. పేదరికం ఉండకూడదనుకుంటే సీఎం వైఎస్ జగన్‌ను గెలిపించుకోవాలన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి పేదవాడి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి జరిగిందంటే అది ఆయన పుణ్యమేనన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాడికొండను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది జగన్ మాత్రమేనన్నారు. 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, తాడికొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహా్మనందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment