
ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్న కేంద్ర పర్యాటక శాఖ సలహాదారు సుమేర్‌సింగ్ సోలింకి
నందలూరు(రాజంపేట): నందలూరు శ్రీసౌమ్యనాథస్వామిని పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ), కేంద్ర పర్యాటకశాఖ సలహాదారు సుమేర్ సింగ్ సోలింకి శనివారం రాత్రి దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువా, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, రాష్ట్ర నాయకులు నాగోతు రమేష్ నాయుడు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అరిగె రాంప్రసాద్, గిరిజన మోర్చా నాయకులు పోతురాజు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment