కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
సిద్దవటం : కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దవటం మండలం ఉప్పరపల్లె సాయినగర్‌లో కె.అనిల్‌కుమార్‌రెడ్డి హ్యాపీ కిడ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నూతన భవనాలను ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. చిన్నారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. మూడేళ్ల పిల్లలను అంగన్‌వాడీలో చేర్పించి..పౌష్టికాహారం అందజేశామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాలంలో 1, 2వ తరగతుల వరకు ప్రాథమిక విద్య, 3వ తరగతి నుంచి 10+2 వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోనూ పోటీ పరీక్షలకు విద్యార్థుల సామర్‌ాధ్యన్ని పెంపొందించేలా సీబీఎస్సీ సిలబస్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇపుడు కూటమి ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని రద్దు చేసే యోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సౌమిత్ర, హరిబాబు, పాఠశాల డైరెక్టర్ శివకుమారి, హెచ్‌ఎం శ్రీరాములు, పారిశ్రామిక వేత్త తాజుద్ధీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment