రాజంపేట బైపాస్‌లో వృద్ధుడి దుర్మరణం
రాజంపేట : రాజంపేట బైపాస్ రహదారిలో గురువారం సుంకేసుల చౌడుసాహెబ్(68) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తెల్లవారుజామున ఉస్మాన్ నగర్‌లోని తన కుమారుడి టీ దుకాణం వద్ద నుంచి బైపాస్‌లోకి బయలుదేరాడు. బైపాస్ క్రాస్ సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఐదు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
సిద్దవటం : మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను గురువారం స్వాధీనం చేసుకున్నామని సిద్దవటం ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. సిద్దవటం మండలం డేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన ఒక రైతు 100 డయల్ ఫోన్ కాల్ ద్వారా ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేయడంతో ఒంటిమిట్ట సీఐ బాబు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేశామన్నారు. డేగనవాండ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో 3 ఇసుక ట్రాక్టర్లను, బండికనుమ వద్ద నుంచి కడపకు వెళుతున్న 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సిద్దవటం పోలీసు స్టేషన్‌కు తరలించి, కడప మైన్స్ అఽధికారులకు రెఫర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్‌రెడ్డి, పోలీసులు రామకుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు.
వేగంగా వెళుతున్న
వాహనంలో మంటలు
గుర్రంకొండ : వేగంగా రోడ్డుపై వెళుతున్న బొలేరో వాహనంలోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పి, వాహనం ముందు భాగం మొత్తం కాలిపోయిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. పెద్దమండ్యం మండలానికి చెందిన రెడ్డెయ్య అనే వ్యక్తి టమాటా లోడుతో గురువారం కలకడ టమాటా మార్కెట్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండకు సమీపంలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద బొలేరో వాహనం ముందుభాగం ఇంజిన్ వైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో డ్రైవర్ రెడ్డెయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెంటనే వాహనం నిలిపేసి దిగిపోయాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడి వాహనం ముందుభాగం మొత్తం కాలిపోయింది. వాహనంలోని ఇంజిన్ భాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజంపేట బైపాస్‌లో వృద్ధుడి దుర్మరణం
రాజంపేట బైపాస్‌లో వృద్ధుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment