సీనీఫక్కిలో బంగారు గొలుసు చోరీ
పీలేరురూరల్ : సినీ ఫక్కీలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రారం పట్టపగలు పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. దొడ్డిపల్లె పంచాయతీ పెద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన కంభం కృష్ణమ్మ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లడానికి పీలేరుకు వచ్చింది. స్థానిక పాతబస్టాండ్ నుంచి కాలినడక వెళ్తుండగా సాయిబాబా గుడి వీధిలో ఓ దుండగుడు ఆమెతో మాట్లాడుతూ ‘అక్కడ పోలీసులు ఉన్నారు.. బంగారు చైను వేసుకున్నవారికి జరిమానా వేస్తున్నారు’ అంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె తన మెడలోని సుమారు 55 గ్రాములు బరువుగల బొట్టుగొలుసు, కాసులు తీసి బ్యాగులో పెట్టుకోబోయింది. అంతలోనే అతను ఓ పేపరు ఇచ్చి ఇందులో భద్రపరచుకో అంటూ సూచించాడు. ఆమె పేపరులో బంగారు నగలు వేయగానే తన చేతో వేరే పేపరు పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తరువాత పేపరు అందులో ఇనుప కమ్మీలు ఉన్నట్లు గ్రహించి మోసపోయానని బంధువులకు సమాచారం ఇచ్చింది. జరిగిన సంఘటనపై ఎస్‌ఐ లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment