జూదరుల అరెస్ట్
సంబేపల్లె : మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీలో పేకాట స్థావరంపై గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు కొండావాండ్లపల్లె సమీపంలో పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం సేకరించి దాడులు చేసి 9 మంది జూదరులను అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి రూ. 2 లక్షల 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలిక ఆత్మహత్య
రాజంపేట : పట్టణంలోని రామ్‌నగర్‌లో ఎం. రేవతి (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడంలేదు. చికిత్స నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.
హత్యరాలలో వ్యక్తి..
రాజంపేట : మండలం లోని హత్యరాల ఇసుక క్వారీ సమీపంలో సిగమాల హరిప్రసాద్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మన్నూరు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుల్లంపేట మండలం రామక్కపల్లె గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. మతిస్థిమితం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వివరించారు. కొద్ది రోజుల కిందట మృతుని తండ్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సెల్‌ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు
మదనపల్లె : సెల్‌ఫోన్ పేలి వ్యక్తి తీవ్రంగా గాయడ్డాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ కుమార్(45) జీవనోపాధి కూలీ పనులు చేసుకునేందుకు పిటిఎంకు వచ్చాడు. స్థానికంగా హంద్రీనీవా పనులు చేస్తున్నాడు. శుక్రవారం పనులు చేసే ప్రదేశంలో ఉన్న జనరేటర్ వద్ద సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టాడు. ఉన్నట్టుండి చార్జర్‌తో పాటు ఫోన్ పేలిపోవడంతో సురేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితులని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కంది పంటకు నిప్పు
పెద్దమండ్యం : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 10 ఎకరాలలో రైతులు సాగుచేసిన కందిపంట అగ్నికి ఆహుతైంది. శుక్రవారం మండలంలోని ముసలికుంటకు సమీపంలో తెల్లరాతివంక వద్ద ఈ ఘటన జరిగింది. రైతుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముసలికుంటకు చెందిన రైతులు సానక్కగారి శ్రీనివాసులురెడ్డి, జి చంద్రప్ప, సి. సుగుణమ్మ 10 ఎకరాలలో కందిపంటను సాగు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పంట మొత్తం కాలిపోయింది. పంటను రక్షించుకొనేందుకు రైతులు ములకలచెరువు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలానికి ఫైర్‌ఇంజిన్ వచ్చినా అప్పటికే పంట మంటల్లో కాలిపోయిందని రైతులు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటగా సాగుచేసిన కందిపంట చేతికి వచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 3 లక్షల నష్టం జరిగినట్లువారు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
జూదరుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment