న్యాయవాదుల చట్టసవరణపై నిరసన
రాయచోటి అర్బన్ : న్యాయవాదుల చట్టసవరణ బిల్లు –25ను వ్యతిరేకిస్తూ రాయచోటి న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డెయ్యల నేతృత్వంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన న్యాయవాదుల చట్టసవరణ బిల్లు –25ను అమలులోకి వస్తే బార్‌కౌన్సిల్ స్వతంత్రప్రతిపత్తికి, న్యాయవాదుల వృత్తిపరమైన సమస్యలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒకరకంగా కక్షిదారులు స్వేచ్ఛగా తన న్యాయవాదిని ఎన్నుకునే పరిస్థితిని కూడా కోల్పోతారంటూ చెప్పారు. న్యాయవాదులు కూడా ఇప్పటిలాగా ఏకేసునైనా డీల్ చేయడానికి ముందుకురాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులన్ని కూడా న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉంటాయన్నాయన్నారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్ సహాయ కార్యదర్శి నాగముని, న్యాయవాదులు ఆనందకుమార్, చిన్నయ్య, టి.ఈశ్వర్, రెడ్డిబాషా, హుమయూన్, రవి శంకర్, నిరంజన్, వరలక్ష్మి, కృష్ణమ్మ, సయ్యద్‌బాషాతో పాటు న్యాయవాదుల గుమస్తాల సంఘం నేతలు రామక్రిష్ణ, సుబ్బరామయ్య, రమణ, వీరనాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment