మదనపల్లె : ఇరువర్గాలు కరల్రతో దాడి చేసుకున్న ఘటనపై కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. గురువారం రాత్రి పుంగనూరు రోడ్డులోని కృష్ణాపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో, వాహనానికి పెట్రోల్ నింపుకునే విషయమై ఇరువురి మధ్య జరిగిన గొడవ, ఇరు గ్రామాలకు పాకి, రెండు గ్రామాల వ్యక్తులు కరల్రతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విషయం తెలిసిందే. మండలంలోని వలస పల్లె పంచాయతీ అరవ వాండ్ల పల్లెకు చెందిన పూల గణేష్, కృష్ణాపురంకు చెందిన హరిల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. ఘర్షణలో హరి, గణేష్ ను కొట్టడంతో, అరవ వాండ్ల పల్లి నుంచి పెద్ద ఎత్తున గణేష్ మద్దతుదారులు కృష్ణాపురం వద్దకు చేరుకున్నారు. దీంతో హరి మద్దతుదారులు సైతం అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి ఇరువర్గాలు కరల్రతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై శుక్రవారం అరవ వాండ్ల పల్లె గణేష్ ఫిర్యాదు మేరకు కృష్ణాపురం కు చెందిన 11 మందిపై, హరి ఫిర్యాదు మేరకు అరవ వాండ్లపల్లి కు చెందిన 13 మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment