మదనపల్లె : బాకీ చెల్లించలేదనే మనస్థాపంతో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. చంద్ర కాలనీకి చెందిన రామమూర్తి కుమారుడు రెడ్డి శేఖర్ (32) స్థానికంగా ఓ వ్యక్తికి నగదు అప్పుగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో బాకీ చెల్లించమని పలుమార్లు అడిగాడు. అయినా అతను బాకీ చెల్లించకపోవడంతో దానిపై ఇంట్లో సమస్యలు ఏర్పడి గొడవ జరిగింది. మనస్థాపం చెందిన రెడ్డి శేఖర్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment