
భద్రకాళీ సమేతుడికి అమావాస్య పూజలు
రాయచోటి టౌన్ : భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి అమావాస్య పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి ఆలయ మాఢవీధుల్లో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ పూజలు ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు.
2న పెంచుపాడులో
ఉచిత మెగా వైద్యశిబిరం
మదనపల్లె : మండలంలోని పెంచుపాడులో ఫిబ్రవరి 2, ఆదివారం దండు చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఐ దండు శేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెంచుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభమవుతుందన్నారు. పెంచుపాడు, సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దండు శాంతమ్మ, దండు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కారు అద్దాలు ధ్వంసం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో వైఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎరికరెడ్డి వీరారెడ్డి కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. బాధితుడి కథనం మేరకు.. వీరారెడ్డికి చెందిన హోండా ఎక్ట్‌స్రా కారును తన ఇంటి వద్ద పెట్టుకున్నాడు. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో బుధవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భద్రకాళీ సమేతుడికి అమావాస్య పూజలు
Comments
Please login to add a commentAdd a comment