ఢిల్లీ రైలు హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్!
రాజంపేట: అధ్యాత్మికనగరం తిరుపతి నుంచి దేశరాజధానికి రాజంపేట, నందలూరు,కడప మీదుగా నడిచే ఢిల్లీ రైలుకు(12708/12707) పార్లమెంటరీ నియోజకవర్గకేంద్రమైన రాజంపేటలో హాల్టింగ్‌కు రైల్వేబోర్డు గ్రీన్‌న్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులును జారీ చేసింది. త్వరలో హాల్టింగ్ తేదీని ఖరారు చేసేందుకు రైల్వేబోర్డు యోచిస్తోంది. అయితే ఈ హాల్టింగ్ ప్రయోగత్మాకంగానే ఇవ్వనున్నారు. హాల్టింగ్ అనంతరం ఎర్నింగ్స్‌ను బేస్ చేసుకో నున్నారు. ఎర్నింగ్స్‌పై నివేదికను జోనల్‌కు వెళ్లిన తర్వాత హాల్టింగ్‌ను కొనసాగించడమా, ఎత్తివేయడమా అనేది ఆలోచన చేయనున్నారు.
● ఢిల్లీ రైలు హాల్టింగ్ ఇవ్వడానికి 17 యేళ్లు పట్టింది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ఎంపీ అయిన తొలినాటి నుంచి రాజంపేటలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కుమార్, రైల్వేబోర్డు చైర్మన్‌ను అనేకమార్లు కలిసి ఈ అంశంపై మాట్లాడారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కూడా ఏపీసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌రైలు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వేశాఖను కోరారు.
● అప్పటి యూపీఏ సర్కార్ రైల్వేమంత్రి లాలుప్రసాద్‌యాదవ్ సంపర్క్ క్రాంతిరైళ్లను తీసుకొచ్చారు. 2005 మార్చి రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన సికింద్రాబాద్ జోనల్ ప్రధానకార్యాలయం, సికింద్రాబాద్ జంక్షన్ ఢిల్లీ నిజాముద్దీన్‌కు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌రైలును జూలై 2005లో పట్టాలెక్కించారు.
●దివంగత సీఎం వైఎస్సార్ చొరవతో..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టి ఏపీసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుపై పడింది. ఈ రైలును ఆధ్యాతికనగరం తిరుపతి నుంచి కడప, రాజంపేట పార్లమెంటరీ కేంద్రాలైన రాజంపేట, కడప మీదుగా సికింద్రాబాద్ వరకు నడిపించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. 2007లో ఈ రైలు సికింద్రాబాదు టు ఢిల్లీకి నడిచింది.దీనిని తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప ,గుత్తి, డోన్, కర్నూలు, మహబూబ్‌నగర్ మీదుగా పొడిగించారు.
● సీమ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా వాసులకు దేశరాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఒక్క రైలు కూడా లేదు. వీరు ఢిల్లీ, ఉత్తరాదినగరాలకు వెళ్లాలంటే రేణిగుంటకు వచ్చి, అక్కడి నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్ ద్వారా వయా నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉండేవి. దివంగత సీఎం వైఎస్సార్ చొరవ వల్ల ఇప్పుడు నేరుగా జిల్లా మీదుగా దేశరాజధానికి వెళ్లేందుకు రైలు అందుబాటులోవచ్చింది.
● ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌రైలును డైలీ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీమప్రాంత ప్రజలకు, ఉత్తర తెలంగాణా నగరాలకు, హైదరాబాద్‌కు వెళ్లడానికి పగటిపూట జర్నీ అందుబాటులో ఉంటుంది. డైలీ నడిస్తే కడప, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, కర్నూలు నుంచి ఖాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్‌నగర్ వెళ్లడానికి ఉపయోగపడుతుంది.
● కేరళ, హిమసాగర్, నవయుగ,స్వర్ణజయంతి నడుస్తున్నాయి. ఇవన్నీ తిరువంతనంతపుర, ఎర్నాకులం, కన్యాకుమారి నుంచి వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్ దొరకడం చాలకష్టం. మూడునెలల ముందు కూడా దొరకవు. ఇవన్నీ గూడూరు–విజయవాడ–వరంగల్–పెద్దపల్లి మీదుగా వెళ్తాయి. ఇటువంటి పరిస్ధితిలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌రైలు డైలీ నడిపిస్తే ఉపయోగకరంగా ఉంటుందని కడప,అనంతపురం,కర్నూలు వాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
రైల్వేబోర్డు నుంచి వెలువడిన ఉత్తర్వులు
17 ఏళ్ల తర్వాత ఏపీ సంపర్క్ క్రాంతికి హాల్టింగ్
ఢిల్లీ రైలు హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్!
ఢిల్లీ రైలు హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్!
ఢిల్లీ రైలు హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్!
Comments
Please login to add a commentAdd a comment